ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు భారత జట్టు ఇదే.. రోహిత్‌శర్మకు షాక్

team india test squad for england
Highlights

ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇంగ్లీష్ జట్టుతో తలపడే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. తొలి మూడు టెస్టులకు గాను 18 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ప్రకటించారు సెలక్టర్లు

ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇంగ్లీష్ జట్టుతో తలపడే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. తొలి మూడు టెస్టులకు గాను 18 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ప్రకటించారు సెలక్టర్లు.. వికెట్ కీపర్ వృద్థిమాన్ సాహా గాయపడటంతో అతని స్థానంలో యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ తొలిసారి టీమిండియాలో స్థానం దక్కించుకున్నాడు. ఇక బొటనవేలి గాయంతో బాధపడుతున్న జస్‌ప్రీత్ బుమ్రాకు కూడా తుది జట్టులో స్థానం  దక్కింది. గాయం నుంచి కోలుకోగానే అతను టీమ్‌ను చేరనున్నాడు.

ఇక యో యో టెస్టులో పాసయిన పేస్ బౌలర్‌ మహ్మద్ షమీకి కూడ స్థానం కల్పించారు.. టీమిండియా ప్రధాన బౌలర్ భువనేశ్వర్ కుమార్ వెన్నునొప్పి మరింత ఎక్కువ అవ్వడంతో.. విశ్రాంతి దృష్ట్యా అతన్ని తీసుకోవాలా..? వద్దా అన్నది త్వరలో నిర్ణయిస్తామని సెలక్టర్లు తెలిపారు. ఆగస్ట్ 1న ఎడ్‌‌బాస్టన్‌లో ‌మొదటి టెస్ట్ జరగనుంది.

జట్టు వివరాలు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్య రహానే ( వైఎస్-కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, మురళీ విజయ్, చతేశ్వర్ పుజారా, కరుణ్ నాయర్, దినేశ్ కార్తీక్, రిషబ్ పంత్, అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్‌దీప్ యాదవ్, హార్డిక్ పాండ్యా, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, బుమ్రా, శార్దూల్ ఠాకూర్.

loader