రెండో రోజే ఆప్ఘాన్ ఆటకట్టించిన టీం ఇండియా, ఇన్నింగ్స్ 262 తేడాతో ఘన విజయం

team india grand victory on bangalore test
Highlights

రెండో ఇన్నింగ్స్ లో 103 పరుగలకే అప్ఘాన్ ఆలౌట్

బెంగళూరు చిన్న స్వామి స్టేడియంలో అప్ఘానిస్థాన్ తో జరుగుతున్న ఏకైక టెస్ట్ లో టీం ఇండియా ఘన విజయం సాధించింది. టెస్టుల్లో ఆరంగేట్రం చేసిన అప్ఘాన్ జట్టు మొదటి మ్యాచ్ లో కనీస పోరాట పటిమను కూడా చూపించలేకపోయింది. భారత బౌలర్ల దాటికి విలవిల్లాడిన అప్ఘాన్  బ్యాటింగ్ లైనఫ్ రెండో రోజే చేతులెత్తేసింది. దీంతో భారత జట్టు ఇన్నింగ్స్ 262 పరుగల తేడాతో సూపర్ విక్టరీ సొంతం చేసుకుంది. 
 
ఫస్ట్ ఇన్నింగ్స్ లో 109 పరుగులకే ఆలౌటైన అప్ఘాన్ జట్టు ఫాలో ఆన్ ఆడింది. అయితే ఫాలో ఆన్ లో కూడా అప్ఘాన్ జట్టు 103 పరుగులకే ఆలౌటైంది. దీంతో భారత జట్టు ఇన్నింగ్స్ 262 పరుగల తేడాతో విజయం సాధించింది.

మొదటి ఇన్నింగ్స్ లో  ఓపెనర్లు మహ్మద్ షెజాద్(14), మహ్మద్ నబీ (24) మహమ్మద్ షహజాద్(14), రహమత్ షా(14), అస్మతుల్లా షాహిది(11), అస్ఘర్(11), ముజీబుర్ రెహ్మాన్(15)లు మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు.  మిగతా వారందరు ఘోరంగా విఫలమై సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. దీంతో 27.5 ఓవర్లకు 109 పరుగులకే ఆలౌటయ్యారు. అప్ఘాన్ జట్టును కట్టడి చేయడంలో భారత బౌలర్లు రవిచంద్రన్ అశ్విన్ 4 వికెట్లు, జడేజా రెండు వికెట్లు,  ఇషాంత్ శర్మ 2, ఉమేష్ యాదవ్ ఒక వికెట్ తీశారు.

ఇక ఫాలో ఆన్ లో భాగంగా రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన అప్ఘానిస్థాన్ జట్టు మళ్లీ అదే పేలవ ఆటతీరును కనబర్చింది.అయితే  బ్యాట్ మెన్స్ స్టానిక్ జాయ్ 25 పరుగులు, షాహిది 36నాటౌట్ తో కాస్సేపు భారత విజయాన్ని ఆపగలిగారు.ఇక మిగతా అప్ఘాన్ ఆటగాల్లందరూ చేతులెత్తేశారు. కేవలం నలుగురు బ్యాట్ మెన్స్ మాత్రమే సెకండ్ ఇన్నింగ్స్ లో రెండంకెల స్కోరు సాధించారు. దీంతో రెండో ఇన్నింగ్స్ లో 38.4 ఓవర్లలో అప్ఘాన్ జట్టు 103 పరుగులకు ఆలౌటయ్యంది.

ఇక రెండో ఇన్నింగ్స్ లో భారత బౌలర్లు జడేజా 4 వికెట్లు,  ఉమేష్ యాదవ్ 3 వికెట్లు, ఇషాంత్ శర్మ 2, అశ్విన్ 1 వికెట్ సాధించారు. ఇలా బౌలర్లు రెండు ఇన్నింగ్స్ లలో అప్ఘాన్ జట్టును తక్కువ స్కోర్లకే కట్టడి చేసింది. దీంతో ఏకైక టెస్ట్ సిరీస్ ను టీం ఇండియా కైవసం చేసుకుంది.

  

 

loader