ఇంగ్లాండ్‌తో తొలి టెస్ట్ సందర్భంగా అత్యంత విపత్కర పరిస్థితుల్లో సెంచరీ చేసిన టీమిండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లీని ఆకాశానికెత్తిస్తున్నారు నెటిజన్లు. సహచరులు ఒక్కొక్కరిగా వెనుదిరుగుతున్నా కోహ్లీ మొత్తం పట్టుదలగా ఆడి జట్టు కెరీర్‌లో 22వ సెంచరీ సాధించడంతో పాటు జట్టును ఇన్నింగ్స్ గండం నుంచి గట్టెక్కించాడు.

మైదానంలో అతని ఆటను చూసిన భారత అభిమానులతో పాటు టీమిండియా దిగ్గజ క్రికెటర్లు సచిన్, సెహ్వాగ్‌లతో పాటు మహ్మద్ కైఫ్, సురేశ్ రైనాలు కోహ్లీని అభినందిస్తూ ట్వీట్ చేస్తున్నారు. నిన్నటి నుంచి కోహ్లీ హ్యాష్ ట్యాగ్‌లతో సోషల్ మీడియా నిండిపోయింది.