కెప్టెన్‌ని అని మరచిపోయి గ్రౌండ్‌లో చిందేసిన కోహ్లీ (వీడియో)

team india captain virat kohli steps in Ground
Highlights

ఎక్కడైనా మనసుకు నచ్చిన బీటు వినిపిస్తే కాలు కదపకుండా వుండలం.. మనిషికి ఇది సహజంగా వచ్చిన అలవాటు.. ఆ సమయంలో తాను ఎక్కడ ఉన్నది.. ఏం చేస్తున్నది అస్సలు పట్టించుకోరు దీనికి సామాన్యులే కాదు సెలబ్రిటీలు కూడా మినహాయింపు కాదు. 

ఎక్కడైనా మనసుకు నచ్చిన బీటు వినిపిస్తే కాలు కదపకుండా వుండలం.. మనిషికి ఇది సహజంగా వచ్చిన అలవాటు.. ఆ సమయంలో తాను ఎక్కడ ఉన్నది.. ఏం చేస్తున్నది అస్సలు పట్టించుకోరు దీనికి సామాన్యులే కాదు సెలబ్రిటీలు కూడా మినహాయింపు కాదు. తాజాగా ఇంగ్లాండ్‌తో టెస్ట్‌సిరీస్ సందర్భంగా టీమిండియా ఎస్సెక్స్ కౌంటీ జట్టుతో మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ అడిన సంగతి తెలిసిందే.

తమ బ్యాటింగ్ ముగిసిన అనంతరం టీమిండియా ఫీల్డింగ్‌కు దిగింది. ఫీల్డింగ్‌కు దిగేందుకు మైదానంలోకి  వస్తున్న కోహ్లీ సేనకు అక్కడి నిర్వాహకులు పంజాబీ స్టైల్లో స్వాగతం పలికారు. బ్యాండ్‌తో సంప్రదాయబద్ధంగా వస్తున్న బీట్‌కు గ్రౌండ్‌లో అడుగుపెడుతున్న కోహ్లీకి తనలోని డ్యాన్సర్ నిద్ర లేచాడు. అందరిని సర్‌ప్రైజ్ చేస్తూ బాంగ్రా స్టెప్పుతో స్టెప్పులు వేశాడు. కెప్టెన్‌ని చూసి వెనుకే వస్తున్న ఓపెనర్ శిఖర్ ధావన్ కూడా కాలు కదిపాడు.

దీంతో గ్రౌండ్ మొత్తం ఈలలు, కేకలతో మారుమోగిపోయింది. దీనికి సంబంధించిన వీడియోను ఎస్సెక్స్ జట్టు ట్వీట్ చేయడంతో అది ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది.


 

loader