ప్రతి మ్యాచ్ నే కాదు, ప్రతి బంతిని గెలవాలనుకుంటాం : విరాట్ కోహ్లీ

Team india captain Virat Kohli press meet on england tour
Highlights

 ఇంగ్లాండ్ ను సొంతగడ్డపై ఓడించే సమయం వచ్చిందన్న కోహ్లీ...

ఇంగ్లాండ్ జట్టును వారి స్వదేశంలోనే ఓడించే సమయం వచ్చిందన్నారు విరాట్ కోహ్లీ. వారిని సొంతగడ్డపై ఓడించి మన సత్తా ఏంటో నిరూపించుకునే అవకాశం ఈ సీరీస్ ద్వారా లభించిందన్నారు. ప్రపంచకప్ కు ముందు ఇంగ్లాండ్ తో ఈ సుధీర్ఘ పర్యటన టీం ఇండియాకు ఎంతగానో ఉపయోగపడుతుందని కోహ్లీ అన్నారు.

ఇవాళ రాత్రి 10 గంటలకు ఇంగ్లాండ్ తో తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ సందర్భంగా కెప్టెన్ కోహ్లీ మీడియాతో మాట్లాడారు. తాము ప్రతి లీగ్ , మ్యాచ్ నే కాదు ప్రతి బంతిని గెలవాలనుకుంటామని పేర్కొన్నారు. అందువల్ల శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని విరాట్ తెలిపారు. ఇంగ్లాండ్ తో సమిష్టిగా ఆడి మంచి విజయాలు సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

ఇంగ్లాడ్ గడ్డపై భయం లేని క్రికెట్ ఆడాలనుకుంటున్నట్లు, ఆ మజాను అనుభవించాలని ఉందని విరాట్ పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రశాంతమైన వాతావరణంలో గడుపుతున్నట్లు తెలిపారు. గత సంవత్సరం జరిగిన ఇండియాలో జరిగిన సీరీస్ ను మనం కైవసం చేసుకున్నట్లు, ఇపుడు ఇంగ్లాండ్ జట్టు కూడా అదే రిజల్ట్ ను ఆశిస్తోందని అన్నారు. కానీ వారికి ఆ అవకాశం ఇవ్వమని కోహ్లీ ధీమా వ్యక్తం చేశారు.  

ఇంగ్లాండ్‌ గడ్డపై కౌంటీ క్రికెట్‌ ఆడుతోన్న ఇండియన్ ప్లేయర్స్ చటేశ్వర పుజారా, ఇషాంత్‌ శర్మలతో ఇప్పటికే మాట్లాడినట్లు కోహ్లీ తెలిపారు. ఇంగ్లాడ్ పరిస్థితులు, పిచ్‌ ల గురించి వారు వివరించారని అన్నారు. దీంతో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టుకు గట్టి పోటీ ఇచ్చేలా తగిన వ్యూహాలు రచిస్తున్నట్లు కోహ్లీ తెలిపారు. 

loader