Asianet News TeluguAsianet News Telugu

టెస్టు సిరీస్‌కు ముందు భారత్‌కు చావు దెబ్బ.. ఈ ముగ్గురు లేకుండా కష్టమే

తొలి టెస్ట్‌కు ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుదామనుకుంటున్న సమయంలో టీమిండియాకు దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే గాయం కారణంగా ప్రధాన పేసర్ భువనేశ్వర్ కుమార్ సిరీస్‌కు దూరం కాగా.. మరో బౌలర్ జస్ప్రిత్ బుమ్రా గాయం నుంచి కోలుకోకపోవడంతో ఆడటం అనుమానంగానే ఉంది

team india bowlers suffers injuries

ఇంగ్లాండ్ చేతిలో వన్డే సిరీస్‌ కోల్పోయి అవమాన భారంతో ఉన్న టీమిండియా ఎలాగైనా టెస్ట్‌సిరీస్‌లో సత్తా చాటాలని వ్యూహాలు రచిస్తోంది. నెట్స్‌లో విపరీతంగా చెమటోడ్చటంతో పాటు వార్మప్ మ్యాచ్‌లో స్థాయికి తగ్గట్టుగానే ఆడుతోంది. తొలి టెస్ట్‌కు ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుదామనుకుంటున్న సమయంలో టీమిండియాకు దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి.

ఇప్పటికే గాయం కారణంగా ప్రధాన పేసర్ భువనేశ్వర్ కుమార్ సిరీస్‌కు దూరం కాగా.. మరో బౌలర్ జస్ప్రిత్ బుమ్రా గాయం నుంచి కోలుకోకపోవడంతో ఆడటం అనుమానంగానే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో స్పిన్నర్ అశ్విన్ కూడా గాయపడటం జట్టును ఆందోళనకు గురిచేస్తోంది.. ప్రాక్టీస్ మ్యాచ్‌లో గాయం కారణంగా ఎస్సెక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అశ్విన్ బౌలింగ్ చేయలేదు. దీంతో అతను తొలి టెస్ట్‌కు దూరమవుతాడంటూ వార్తలు వచ్చాయి.

దీనిపై స్పందించిన జట్టు మేనేజ్‌మెంట్ అశ్విన్ గాయంపై ఆందోళన పడాల్సిన అవసరం లేదని... అతనికి తొలి టెస్ట్‌లో విశ్రాంతినిచ్చి తర్వాతి మ్యాచ్‌లకు సిద్ధం చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.. ఒకవేళ రవిచంద్రన్ అశ్విన్‌కు విశ్రాంతినిస్తే.. అతని స్థానలో కుల్‌దీప్ యాదవ్‌కు తుది జట్టులో అవకాశం లభించనుంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios