Asianet News TeluguAsianet News Telugu

ఎమిల్ ఏకైక గోల్.. స్వీడన్ విన్..!

1-0తో స్విట్జర్లాండ్‌పై స్వీడన్ గెలుపు... 24 ఏళ్ళ తర్వాత క్వార్టర్ ఫైనల్స్‌కు

Sweden beat Switzerland

హైదరాబాద్: ఎమిల్ ఫోర్స్‌బెర్గ్ లేని స్వీడన్ జట్టును అస్సలు ఊహించుకోలేమనిపిస్తుంది మంగళవారం స్విట్జర్లాండ్, స్వీడన్ మధ్య జరిగిన మ్యాచ్ చూసినవారికి. 24 సంవత్సరాల నాటి అనిర్వచనీయమైన అనుభూతిని జట్టుకు అందించడంలో కీలక పాత్ర పోషించాడు. 66వ నిముషంలో గోల్ సాధించాడు. స్విట్జర్లాండ్‌పై 1-0 గోల్స్ తేడాతో స్వీడన్‌కు విజయం అందించాడు. క్వార్టర్ ఫైనల్స్‌కు మార్గం సుగమం చేశాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా మిడ్ ఫీల్డర్ ఎమిల్ ఫోర్స్‌బెర్గ్ నిలిచాడు.

ఆట ఆరంభమైనప్పటి నుంచి ప్రేక్షకుల్లో పడుతూ లేస్తూ ముందుకు సాగుతున్న స్వీడన్ జట్లు పట్ల పెద్దగా అంచనాల్లేవు. అందరి దృష్టి ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టించే స్విట్జర్లాండ్‌పైనే ఉంది. 

వీక్షకుల అంచనాలకు తగ్గట్టుగా దాదాపు మ్యాచ్ అంతా స్విట్జర్లాండ్ బాల్‌ను తన కంట్రోల్‌లో ఉంచుకుంది. 18 సార్లు స్వీడన్ గోల్ పోస్టులపై అటాక్ చేసింది. ఇంతా చేసి 11 కార్నర్‌లు దక్కించుకున్నప్పటికీ పక్కాగా ఉన్న పెట్టని గోడ లాంటి స్వీడన్ జట్టు డిఫెన్స్‌ను తునాతునకలు చేయలేకపోయింది. ఇలా ఎలాంటి గోల్ లేకుండానే ఫస్టాఫ్ ముగిసిపోయింది.

సెకండాఫ్‌లోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. అదను ఎదురు కోసం చూస్తున్న స్వీడన్‌కు అవకాశం రానే వచ్చింది. సరిగ్గా అలాంటప్పుడే ఎమిల్ ఫోర్స్‌బెర్గ్ ముందుకు వచ్చాడు. 66వ నిముషంలో పక్కా టైమింగ్‌తో షాట్ కొట్టాడు. స్విట్జర్లాండ్ గోల్ కీపర్ సోమర్‌కు దిమ్మదిరిగిపోయేలా గోల్ చేశాడు. స్వీడన్‌కు 1-0 గోల్స్ తేడాతో విజయాన్ని అందించాడు.

Follow Us:
Download App:
  • android
  • ios