సూర్య కుమార్ యాదవ్...ఐపిఎల్  సీజన్ 11 లో ముంబై ఇండియన్స్ జట్టు తరపున ఆడి అద్బుత ప్రదర్శన చేసిన ఆటగాడు. ముంబై జట్టులో ఓపెరన్ గా చక్కగా రాణించి జట్టు విజయాల్లో కీలక పాత్ర వహించిన వ్యక్తి.  ఈ ఐపిఎల్ లో మొత్తం 14 మ్యాచ్ లు ఆడిన సూర్యకుమార్ 521 పరుగులు సాధించి, ఐపిఎల్ లో అత్యధిక పరుగులు సాధించిన టాప్ టెన్ బ్యాట్స్ మెన్స్ జాబితాలో నిలిచాడు. అయితే తనలో అద్బుతమైన ఆటగాడే కాదు, మంచి కొడుకు దాగున్నాడని నిరూపించుకున్నాడు. ఐపిఎల్ ద్వారా వచ్చిన భారీ మొత్తాన్ని తన తల్లిదండ్రులకు గిప్ట్ ఇవ్వడానికి ఖర్చుపెట్టి తనకు తల్లిదండ్రులపై ఉన్న ప్రేమను చాటుకున్నాడు.  

ఐపీఎల్‌ 11 సీజన్ వేలంలో సూర్య కుమార్ ను ముంబై ఇండియా జట్టు రూ. 3.02 కోట్ల భారీ మొత్తాన్ని చెల్లించి దక్కించుకుంది. అయితే ఇలా ఐపీఎల్‌ ద్వారా వచ్చిన భారీ డబ్బుతో సూర్యకుమార్‌ ఓ స్కోడా కారును కొన్నాడు. అయితే, ఈ కారు కొన్నది తనకోసం కాదట, తన తల్లిదండ్రుల కోసమని సూర్యకుమార్ చెప్పాడు.   

" ఇది నా జీవితంలో మధుర క్షణం... నేను కొన్న మొదటి కారు ఇది. దీన్ని కొన్నది నా కోసం కాదు, అమ్మానాన్నలకు గిప్ట్ ఇవ్వడానికి తీసుకున్నాను. ఇలా  నా సంపాదనతో తల్లిదండ్రులకు గిప్ట్ ఇవ్వడం ఆనందంగా భావిస్తున్నాను. వారు తన ఈ గిప్ట్ తో సంతోషిస్తారని బావిస్తున్నా. లవ్యూ మామ్ ఆండ్ డాడ్'' అంటూ తల్లిందండ్రులతో కొత్త కారు వద్ద దిగిన ఫోటోను  ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు.