ఫైనల్లో కెన్యాపై భారత్ గెలుపు (వీడియో)

Sunil Chhetri equals Lionel Messi’s tally of 64 international goals
Highlights

ఇంటర్‌కాంటినెంటల్‌ కప్‌లో భారత్ విజయం

 

కెన్యాతో జరిగిన ఇంటర్ కాంటినెంటల్ కప్ ఫైనల్లో భారత్ 2-0 తేడాతో గెలుపొందింది. ఈ సిరీస్‌లో 8 గోల్స్ చేసిన ఛెత్రీ భారత విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో చెత్రీ అర్జెంటీనా స్టార్‌ మెస్సీ సరసన చేరాడు. ప్రస్తుతం ఫుట్‌బాల్‌ ఆడుతున్న క్రీడాకారుల్లో అత్యధిక గోల్స్‌ చేసిన రెండో ప్లేయర్‌గా మెస్సీతో జత కట్టాడు. మెస్సీ 124 మ్యాచ్‌ల్లో 64 గోల్స్‌ చేయగా... చెత్రీ 102 మ్యాచ్‌ల్లోనే 64 గోల్స్‌ సాధించాడు. ఈ జాబితాలో పోర్చుగల్‌ స్టార్‌ రొనాల్డో (150 మ్యాచ్‌ల్లో 81 గోల్స్‌) అగ్రస్థానంలో ఉన్నాడు.  

 

loader