రష్యాపై సూపర్ విక్టరీ తర్వాత ఉరుగ్వే అభిమానుల సందడి (వీడియో)

Suarez, Cavani score as Uruguay hand Russia a crushing 3-0 defeat
Highlights

గ్రూప్ ఎ టాప్ లేపిన ఉరుగ్వే...

ఫిపా వరల్డ్ కప్ లో మంచి ఫామ్ లో దూసుకుపోతున్న ఆతిథ్య రష్యా జట్టును ఉరుగ్వే కంగుతినిపించింది. ఉరుగ్వే స్టార్ ఆటగాడుమ సురేజ్ జోరుతో పాటు రష్యా జట్టు తప్పిదాలు ఉరుగ్వేను విజయతీరానికి చేర్చాయి. ఈ విజయంతో ఉరుగ్వే జట్టు గ్రూప్ ఎ లో టాప్ లో నిలిచింది.

ఇప్పటికే ఇరు జట్లు రెండేసి మ్యాచ్ లు గెలిచి నాకౌట్ కు అర్హత సాధించాయి. అయితే ఈ మ్యాచ్ గ్రూప్ ఎ లో టాపర్ ఎవరో నిర్ణయించాడినే అన్నట్లు జరిగింది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఎనిమిది గోల్స్‌తో అదరగొట్టిన రష్యా జట్టు ఈసారి ఉరుగ్వే దాటికి తట్టుకోలేక పోయింది. ఉరుగ్వే డిఫెన్స్‌ ధాటికి రష్యా ఒక్క గోల్‌ కూడా చేయకపోగా సెల్ఫ్‌ గోల్‌ చేసుకుని వారి ఆధిక్యాన్ని మరింత పెంచింది. ఆట మొదలైన పదో నిమిషంలోనే సురెజ్‌ కళ్లు చెదిరే ఫ్రీకిక్‌ గోల్‌తో ఆధిక్యం అందించాడు. ఆ తర్వాత 23వ నిమిషంలో రష్యా సెల్ఫ్‌ గోల్‌ చేయగా, ఆఖరి నిమిషంలో కావని మరో గోల్‌ సాధించాడు. దీంతో ఉరుగ్వే మూడో గోల్స్ తో విజయం సాధించింది. 

దీంతో మూడు విజయాలతో 9 పాయింట్లు సాధించిన ఉరుగ్వే జట్టు  గ్రూప్ ఎ టాపర్ గా నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో రష్యా జట్టు నిలిచింది. ఉరుగ్వే విజయంతో అభిమానులు మరోసారి సంబరాలు చేసుకుంటున్నారు. తమ జట్టు అధ్బుతమైన ఆటతీరుతో దేశ ప్రజల మనసులు గెలుచుకుందని  తెలిపారు. రష్యా జట్టు గట్టి పోటీ ఇస్తుందని బావించామని కానీ తమ జట్టు డిపెన్స్ ముందు ఆ జట్టు ఆటలు సాగలేవని అన్నారు. ఈ విజయంతో ఉరుగ్వే గ్రూప్ ఎ టాప్ లో నిలవడంతో వారు ఆనందాన్ని వ్యక్తం చేశారు. 

"

loader