ఐపిఎల్ లో తన అద్బుత బౌలింగ్ ప్రదర్శనతో సన్ రైజర్స్ హైదరాబాద్ విజయాల్లో తనవంతు పాత్ర పోషించిన బౌలర్ సందీప్ శర్మ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. త్వరలోనే ఆయన తన ప్రేయసి తాషా సాత్విక్ ను పెళ్లాడనున్నట్లు తెలిపాడు. ఇప్పటికు తమకు నిశ్చితార్థం జరిగిందని సందీప్ శర్మ వెల్లడించారు. తనకు కాబోయే భార్య సాత్విక్ తో కలిసి దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన సందీప్ ఈ విషయాన్ని తెలిపాడు.
  
గతంలో సందీప్ కింగ్స్ లెవెన్ పంజాబ్ తరపున ఐపిఎల్ లో ఆడాడు. ఈ సమయంలోనే వీరి మద్య ప్రేమ చిగురించింది. దీంతో సందీప్ అద్బుత ప్రదర్శన చేసినప్పుడల్లా తాషా సోషల్ మీడియాలో ఆయనకు అభినందనలు తెలిపేది. దీంతో వీరి మద్య ఏదో జరుగుతోందని అభిమానుల్లో గుసగుసలు మొదలయ్యాయి. అయితే వీటికి తెరదించుతూ ఆమెను పెళ్లి చేసుకోనున్నట్లు సందీప్ ప్రకటించారు.

ఈ ఐపిఎల్ సీజన్ లో హైదరాబాద్ జట్టు ఆడిన పలు మ్యాచ్ లకు తాషా వచ్చిన విషయం తెలిసిందే. త్వరలో సందీప్, తాషా మూడుముళ్ల బంధంతో ఒక్కటవుతున్నారన్న వార్త విని క్రికెట్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.