సానియా, షోయబ్ మాలిక్ విడాకులు నిజమేనా..!? మాలిక్ అలా చేయడంతో.. మరోసారి తెరపైకి..
Sania Mirza: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ 2010లో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులు 2018లో కుమారుడు జన్మించాడు. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయని త్వరలో విడాకులు తీసుకోబోతున్నట్టు పుకార్లు వస్తున్నాయి. అయితే.. తాజాగా జరిగిన ఓ పరిణామం.. వారి విడాకుల పుకార్లను పునరుజ్జీవం పోస్తోంది. ఇంతకీ ఏం జరిగింది.
Sania Mirza: భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ విడాకులు తీసుకోబోతున్నారనే మరోసారి వార్తలు షికారు చేస్తున్నాయి. తాజా జరిగిన ఓ పరిణామం ఆ వార్తలను పునరుజ్జీవం పోస్తున్నాయి. అసలేం జరిగిందంటే.. పాకిస్థాన్ క్రికెట్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ తన ఇన్‌స్టాగ్రామ్ బయోలో చేసిన మార్పే ఈ ఊహాగానాలకు దారి తీశాయి.
ఇటీవల షోయబ్ తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌ను మార్చారు. గతంలో వారిద్దరూ కలిసి ఉన్న ఫోటోను ప్రొఫైల్ పెట్టుకున్నాడు. కానీ.. తాజాగా ఆ ఫోటోను తొలగించి.. తన సింగిల్ ఫోటోను ప్రొఫైల్ ఫిక్ గా పెట్టుకున్నాడు. అలాగే..ఇన్‌స్టాగ్రామ్ బయోను కూడా మార్చారు. ఇంతకుముందు షోయబ్ మాలిక్ ఇన్‌స్టాగ్రామ్ బయోలో 'సూపర్ ఉమెన్ సానియా మీర్జా' అని ఉండేది. అయితే ఇప్పుడు దానిని తన బయోలోంచి తొలగించి.. బయోలో తన వ్యక్తిగత సమాచారాన్ని పొందుపరిచాడు. ఈ మార్పుల తర్వాత వీరిద్దరి మధ్య ఏదీ సరిగా లేదంటూ పాక్ మీడియాలో కూడా వార్తలు రావడం మొదలయ్యాయి.
కొన్ని నెలల క్రితం కూడా సానియా,షోయబ్ మధ్య విభేదాలు తల్లెత్తాయనీ, వారిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారనే పుకార్లు తెగ షికార్లు చేశాయి. పాక్ మీడియా కూడా ఇందుకు సంబంధించిన వార్తలను ప్రసారం చేసింది. అయితే ఈ విషయంలో సానియా, షోయబ్‌ల నుంచి ఎలాంటి స్పష్టమైన ప్రకటన వెలువడలేదు. గతంలో షోయబ్ సానియాను మోసం చేశాడనే ప్రచారం కూడా జరిగింది. పాకిస్థానీ నటి అయేషా ఉమర్‌తో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నడనే ప్రచారం జరిగింది.
ఈ క్రమంలో షోయబ్,అయేషాల ఫోటోలు కూడా తెగ వైరల్ అవుతున్నాయి. దీనిపై అయేషా స్వయంగా మాట్లాడుతూ.. ఇవి కేవలం ప్రకటన కోసం చిత్రీకరించిన చిత్రాలు మాత్రమేనని తెలిపింది. ఎఫైర్ వార్తలను కొట్టిపారేసింది. అవి పుకార్లు మాత్రమేనని తేల్చివేసింది. ఈ పుకార్లు షికార్లు చేస్తున్న సమయంలో సానియా,షోయబ్‌ల కొత్త టాక్ షో 'ది మీర్జా మాలిక్ షో'రావడంతో ఆ ఊహాగానాలన్నింటికీ తెరపడింది. సానియా, షోయబ్‌ల ఈ ప్రోగ్రామ్ కు మంచి ఆదరణ కూడా వచ్చింది.
2010లో వివాహం
సానియా, షోయబ్ లు 2010లో వివాహం చేసుకున్నారు.ఈ దంపతులు 30 అక్టోబర్ 2018న కుమారుడు జన్మించారు. షోయబ్ మాలిక్‌తో వివాహానికి ముందు, సానియా మీర్జా తన చిన్ననాటి స్నేహితురాలు సోహ్రాబ్ మీర్జాతో నిశ్చితార్థం చేసుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల సోహ్రాబ్-సానియాల నిశ్చితార్థం రద్దయిన విషయం తెలిసిందే.
ఇక సోర్ట్స్ లైఫ్ కు వస్తే.. సానియా మీర్జా ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ 2023 మిక్స్‌డ్ డబుల్స్‌లో పాల్గొంది. కానీ.. ఈ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫైనల్‌లో సానియా ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. టైటిల్ మ్యాచ్‌లో సానియా,రోహన్ బోపన్నల జోడి 6-7, 2-6తో బ్రెజిల్ జోడీ లూయిసా స్టెఫానీ, రాఫెల్ మాటోస్ చేతిలో ఓడిపోయింది. ఈ ఓటమితో సానియా మీర్జా గ్రాండ్ స్లామ్ కెరీర్ ముగిసింది.
ఫైనల్ మ్యాచ్‌లో సానియా ఓటమి తర్వాత ఆమె భర్త షోయబ్ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. 'మీరు క్రీడల్లో మహిళలకు ఆశాకిరణం. మీ కెరీర్‌లో మీరు సాధించిన ప్రతిదానికీ మీ గురించి చాలా గర్వంగా ఉంది. మీరు చాలా మందికి స్ఫూర్తి, దృఢంగా ఉండండి. అద్భుతమైన కెరీర్ కోసం చాలా అభినందనలు. అని పోస్టు చేశాడు.