టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రిటైర్ అయ్యే సమయం వచ్చిందని అతనిపై ఇంటా బయటా ఒత్తిడి పెరుగుతోంది. మాజీలతో పాటు పలువురు అభిమానులు ఈ జార్ఖండ్ డైనమైట్ క్రికెట్ నుంచి తప్పుకోవాలని విమర్శిస్తున్నారు. 

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రిటైర్ అయ్యే సమయం వచ్చిందని అతనిపై ఇంటా బయటా ఒత్తిడి పెరుగుతోంది. మాజీలతో పాటు పలువురు అభిమానులు ఈ జార్ఖండ్ డైనమైట్ క్రికెట్ నుంచి తప్పుకోవాలని విమర్శిస్తున్నారు.

ఈ క్రమంలో ధోనికి మద్ధతుగా నిలిచాడు పాక్ మాజీ డాషింగ్ క్రికెటర్ షాహిద్ అఫ్రిది. భారత క్రికెట్‌కు మహీ ఎన్నో ఏళ్లుగా తన విలువైన సేవలను అందిస్తున్నాడు. జట్టును ముందుండి నడిపించి ఎన్నో మరుపురాని విజయాలను అందించాడు.

ఒక సారథిగానూ అంతను ఎంతగానో విజయవంతమయ్యాడు. దీనికి తోడు వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని అతని అవసరం టీమిండియాకు ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డాడు.

ఆయన అందించిన సేవల గురించి సరిగా ఎవరికి తెలియదు.. ఈ క్రమంలో అతనిని రిటైర్ అవ్వాలని అడిగే హక్కు కూడా ఎవరికీ లేదని అఫ్రిది వ్యాఖ్యానించాడు. గత కొన్ని సిరీస్‌ల నుంచి ధోనీ పూర్తిగా నిరాశపరుస్తున్నాడు. వేగంగా పరుగులు చేయలేకపోతున్నాడు..

దీంతో వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్‌ దృష్ట్యా అతనికి రిజర్వ్ వికెట్ కీపర్ కోసం రిషబ్ పంత్‌కు అవకాశం ఇచ్చింది బీసీసీఐ. ఇందు కోసం విండీస్, ఆసీస్‌ టీ20 సిరీస్‌ల్లో ధోనిని తప్పించారు సెలక్టర్లు.

కోహ్లీ కంటే ధోనినే బెస్ట్...కానీ కొహ్లీనే నా ఫేవరెట్: అఫ్రిది

ధోని ప్రదర్శన అంత గొప్పగా ఏమీ లేదు.. గంగూలీ షాకింగ్ కామెంట్స్

'వీల్‌చైర్లో ఉన్నా ధోనిని బరిలోకి దించుతా''

పంత్...ధోనిని కాపీ కొట్టకు

ధోని పనైపోయింది... అతడిపై అంచనాలు తగ్గించుకోవాలి : సంజయ్ మంజ్రేకర్