ప్రేమలో సైనా, కశ్యప్.. త్వరలో పెళ్లి..?

ప్రేమలో సైనా, కశ్యప్.. త్వరలో పెళ్లి..?

బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ప్రేమలో పడిందా..?  అవుననే సమాధానమే ఎక్కువగా వినపడుతోంది. ఇంతకీ ఆ ప్రేమ ఎవరితోనే తెలుసా.. మరో స్టార్ షట్లర్ పారుపల్లి కశ్యప్ తో. మీరు చదివింది నిజమే.. వీరిద్దరూ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారని.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ.. వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

 

 

Happy birthday to #fatpigeon 👏👌👍 ..... photo credit to @gurusaidutt 😘

A post shared by SAINA NEHWAL (@nehwalsaina) on

ఈ పుకార్లు నిజం అనిపించేలా ఓ ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇటీవల హైదరాబాద్‌లోని ఓ రెస్టారెంట్లో కశ్య్‌పతో కలిసి దిగిన ఫొటోను సైనా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. అయితే ఈ ఫొటో వైరల్‌గా మారడంతో వీరిద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ నెట్టింట్లో కామెంట్లు వెల్లువెత్తాయి. ‘ఇద్దరిదీ పర్‌ఫెక్ట్‌ జోడీ’ అని ఒకరు కామెంట్‌ చేయగా.. ‘చూడ్డానికి చక్కగా ఉన్నారు.. డేటింగ్‌ వార్తలను నిజం చేయండి.. ప్లీజ్‌’ అంటూ మరొకరు.. ‘ఇప్పటికే బ్యాడ్మింటన్‌లో చాలామంది జంటలుగా మారారు, మీరూ వాళ్లను అనుసరించండి’ అంటూ ఇంకొకరు సూచించారు. మరి.. అభిమానుల కోరికను సైనా, కశ్యప్‌ నిజం చేస్తారా..? చూడాలి.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM SPORTS

Next page