బ్రేకింగ్: 2020 ఒలింపిక్స్ నుంచి రష్యా ఔట్
2020లో జరగనున్న ఒలింపిక్స్ గేమ్స్ నుంచి రష్యా తప్పుకుంది. ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) నిర్వహించిన డోపింగ్ పరీక్షలో రష్యా జట్టు అడ్డంగా దొరికిపోయింది.
2020లో జరగనున్న ఒలింపిక్స్ గేమ్స్ నుంచి రష్యా తప్పుకుంది. ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) నిర్వహించిన డోపింగ్ పరీక్షలో రష్యా జట్టు అడ్డంగా దొరికిపోయింది. దీనిని తీవ్రంగా పరిగణించిన వాడా రష్యా జట్టుపై నాలుగేళ్ల నిషేధం విధించింది.
Also Read:వాడా సంచలన నిర్ణయం... 2020 ఒలింపిక్స్ కు ముందు భారత్ కు షాక్
ఈ నిర్ణయంతో ఆ జట్టు ఒలింపిక్స్‌తో పాటు రాబోయే నాలుగేళ్ల కాలంలో ఎలాంటి ప్రతిష్టాత్మక టోర్నీల్లోనూ పాల్గొనకూడదు. అయితే డోపింగ్ కుంభకోణంలో తమకు సంబంధం లేదని నిరూపించుకున్న అథ్లెట్లు తటస్థ జెండా కింద పాల్గొనవచ్చని వాడా తెలిపింది.
Also Read:టోక్యో ఒలింపిక్స్ 2020: భారత బాక్సింగ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం
డోపింగ్ వ్యవహారంపై స్విట్జర్లాండ్‌లోని లౌసాన్‌లో జరిగిన సమావేశంలో వాడా ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది. నిషేధంపై అప్పీల్ చేయడానికి రష్యా జట్టుకు 21 రోజుల గడువును ఇచ్చింది.
2014లో సోచిలో జరిగిన ఒలింపిక్స్‌లో డోపింగ్ టెస్టులో రష్యా జట్టు దొరికిపోవడంతో 168 అథ్లెట్లు 2018లో ప్యోంగ్‌చాంగ్‌లో జరిగిన వింటర్ ఒలింపిక్స్ సందర్భంగా తటస్థ జెండా కింద పాల్గొన్నారు.