Asianet News TeluguAsianet News Telugu

వరల్డ్ కప్‌లో రొనాల్డో తొలి హ్యాట్రిక్.. స్పెయిన్‌తో మ్యాచ్ డ్రా

వరల్డ్ కప్‌లో రొనాల్డో తొలి హ్యాట్రిక్.. స్పెయిన్‌తో మ్యాచ్ డ్రా 

Ronaldo achieve first world cup hat-trick

హైదరాబాద్: వరల్డ్ కప్‌ టోర్నమెంట్‌లో ఓపెనింగ్ మ్యాచ్ గెలుచుకోవాలనుకున్న స్పెయిన్ ఆశలను పోర్చుగల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో నిలువునా కూల్చాడు. వరల్డ్ కప్‌లో తొలిసారిగా హ్యాట్రిక్ గోల్ చేయడం ద్వారా ప్రత్యర్థి జట్టు చేతిదాకా వచ్చిన విజయాన్నిదూరం చేశాడు. 3-3 తో మ్యాచ్ డ్రా కావడానికి మూలకారకుడయ్యాడు. టోర్నమెంట్ తుదికంటా పోరాడాలన్న పోర్చుగల్ కల సాకారమయ్యే దిశగా జట్టులో ఆత్మ స్థైర్యాన్ని నింపాడు. శుక్రవారం రాత్రి పొద్దుపోయాక సోచిలోని ఫిస్ట్ ఒలింపిక్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య సాగిన ఫుట్‌బాల్ పోరు ఆద్యంతం ఓ సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపించింది. అభిమానులను అసలైన వీకెండ్‌ను అందించింది. హోరాహోరీగా సాగిన గేమ్‌లో ఇరు జట్లు నువ్వా నేనా అన్నరీతిలో ఎత్తుకు పై ఎత్తులు వేశారు. 


రొనాల్డో పోర్చుగల్‌కు తొలి గోల్ అందించి అభిమానులను ఆనంద డోలికల్లో ముంచెత్తాడు. అంతే దీటుగా స్పెయిన్ ప్లేయర్ డిగో కోస్టా గోల్ చేయడంతో ఒక్కసారిగా గేమ్ ఉత్కంఠభరితమైన వాతావరణాన్ని నెలకొల్పింది. 1-1 ఉన్న స్కోరు కాస్త కోస్తా, రొనాల్డో మరోసారి చెరి ఒక గోల్ చేయడంతో 2-2 కు చేరుకుంది. నాచో మరో గోల్ చేయడంతో స్పెయిన్ 3 గోల్స్, పోర్చుగల్ 2 గోల్స్ చేశాయి. అయితే స్పెయిన్ చేసిన తప్పిదానికి ప్రత్యర్థి జట్టు ఫ్రీ కిక్ చేసే అవకాశం వచ్చింది. అది ఎక్స్‌ట్రా టైమ్ నాలుగు నిముషాల్లో. 
అందరి చూపు బాల్ ఎదురుగా నిలబడ్డ రొనాల్డోపైనే ఉంది. అతడి కాలిలో ఏ మాయ ఉందో కానీ తెలియదు కానీ దడి కట్టిన ప్రత్యర్థుల తలల మీద వెళ్ళిన బాల్ స్పిన్ చేసినట్టుగా చేరుకొని రొనాల్డో ఖాతాలో తొలి వరల్డ్ కప్ హ్యాట్రిక్ రికార్డును సంపాదించి పెట్టింది. ఒక రకంగా చెప్పాలంటే దాన్ని కిక్ ఆఫ్ ది మ్యాచ్ అనాలి. ఆ కిక్‌తో మ్యాచ్ 3-3తో డ్రా అయ్యింది. పో్ర్చుగల్‌కు 1 పాయింట్ తెచ్చి పెట్టింది. ఇంతటి ఘనత సాధించిన అతడు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. 
మ్యాచ్ లెక్కలోకి వెళితే.. స్పెయిన్ 12 అటెంప్ట్స్, 10 ఫౌల్స్ చేస్తే పోర్చుగల్ 8 అటెంప్ట్స్, 12 ఫౌల్స్‌కు పాల్పడింది. ఇరు జట్లకు చెరొక ఎల్లో కార్డు వార్నింగ్ వచ్చింది. మొత్తం మ్యాచ్ ఆడిన సమయం 90+4 నిముషాలు అంటే 94 నిముషాలు. 

Follow Us:
Download App:
  • android
  • ios