పుకార్లు నమ్మొద్దు, ప్లీజ్! నన్ను వదిలేయండి!!: రిషబ్ పంత్

పుకార్లు నమ్మొద్దు, ప్లీజ్! నన్ను వదిలేయండి!!: రిషబ్ పంత్

న్యూఢిల్లీ: ప్రస్తుతం జరుగుతున్న ఐపిఎల్ మ్యాచుల్లో దుమ్ము రేపుతున్న ఢిల్లీ డేర్ డెవిల్స్ ఆటగాడు రిషబ్ పంత్ తనపై వచ్చిన వార్తలను ఖండించాడు. టీమిండియా వన్డే, టీ20 జట్లలోకి తనను ఎంపిక చేయకపోవడంపై తాను ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వచ్చిన వార్తలతో ఆయన చిక్కుల్లో పడ్డాడు. 

ఆ ప్రచారంపై రిషబ్ పంత్ ట్విట్టర్ స్పందించాడు. తాను ఎప్పుడు కూడా అలా అనలేదని స్పష్టం చేశాడు. ఇటువంటి పుకార్లను ప్రచారం చేయడం మానుకోవాలని, తన మానాన తనను వదిలేయాలని ఆయన వేడుకున్నిాడు. 

తాను ప్రస్తుతం క్రికెట్ పై దృష్టి సారించాలని అనుకుంటున్నానని, ఇంతటితో ఆ వివాదానికి స్వస్తి చెప్పాలని ఆయన అన్నాడు. సన్ రైజర్స్ హైదరాబాదు జట్టుకో గత వారం జరిగిన మ్యాచులో రిషన్ చెలరేగి ఆడి 63 బంతుల్లో 128 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 
ఆ సెంచరీ చూసిన తర్వాతనైనా తనను ఇంగ్లండు పర్యటనకు ఎంపిక చేసిన టీమిండియా వన్డే, ట్వంటీ20 జట్లలో తనకు స్థానం కల్పించకపోవడంపై మండిపడినట్లు వార్తలు వచ్చాయి.

"ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్థాన్, ఐర్లాండ్ పర్యటనలకు నన్ను ఎంపిక చేయకపోవడంపై సెలక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశా. ఈ రోజు నా ఫామ్‌ను చూసి కూడా ఎంపిక చేయకపోవడంతో కోపం వచ్చింది. ఈ ఇన్నింగ్స్ తర్వాత జట్టులో స్థానం ఆశించా" అని రిషబ్ పంత్ అన్నట్లు సోషల్ మీడియాలో ఓ ట్వీట్ వైరల్ అయింది. 

షబ్ ఈ సీజన్ లో ఇప్పటి వరకు 582 రుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానంలో నిలించాడు. రిషబ్ త్వరలోనే టీమిండియాకు ఆడుతాడని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నాడు. ఈ నేపథ్యంలో రిషబ్ పంత్ ఆ వ్యాఖ్యలు చేసినట్లు వార్తలు వచ్చాయి.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos