కునుకుతీసిన రవిశాస్త్రి.. ఆంధ్రా భోజనం తిన్నావా..? అంటూ ఫ్యాన్స్ సెటైర్లు

ravi shastri caught cameras while sleeping in first test
Highlights

బాగా షుస్టుగా భోజనం చేసిన తర్వాత ఓ కునుకు తియడం సహజం. అందుకు సామాన్యులే కాదు.. సెలబ్రిటీలు సైతం మినహాయింపు కాదు. కాకపోతే తామున్న స్థితిని కూడా పట్టించుకోవాలి. ఇలా అజాగ్రత్తగా ఉండి టీమిండియా కోచ్ రవిశాస్త్రి ఇప్పుడు అభాసుపాలయ్యాడు. 

బాగా షుస్టుగా భోజనం చేసిన తర్వాత ఓ కునుకు తియడం సహజం. అందుకు సామాన్యులే కాదు.. సెలబ్రిటీలు సైతం మినహాయింపు కాదు. కాకపోతే తామున్న స్థితిని కూడా పట్టించుకోవాలి. ఇలా అజాగ్రత్తగా ఉండి టీమిండియా కోచ్ రవిశాస్త్రి ఇప్పుడు అభాసుపాలయ్యాడు. ఐదు టెస్ట‌ుల సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్-భారత్ జట్ల మధ్య బర్మింగ్‌హో‌మ్‌లో తొలి టెస్ట్ జరుగుతోంది.  తొలి రోజు ఆటలో భాగంగా ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేస్తోంది..

లంచ్ విరామం తర్వాత క్రీజులోకి వచ్చిన ఆతిథ్య జట్టు పటిష్ట స్థితిలో ఉంది.. వారిని ఎలా అవుట్ చేయాలో తెలియక భారత బౌలర్లు దిక్కులు చూస్తున్నారు.ఈ సమయంలో జట్టుకు దిశానిర్దేశం చేయాల్సిన కోచ్ రవిశాస్త్రి కునుకు తీశారు. లైవ్ కెమెరాలు ఆయన వంక ఫోకస్ చేయడంతో గ్రౌండ్‌లో ఉన్న వారంతా అవాక్కయ్యారు. కామెంటరీ చెబుతున్న మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్.. శాస్త్రిని లేపే ప్రయత్నం చేశాడు..

‘‘శాస్త్రి గారు నిద్రపోతున్నారు.. రవి నిద్ర నుంచి మేలుకో’’ అంటూ భజ్జీ చెప్పడంతో నవ్వులు పూశాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రవేశించడంతో అభిమానులు శాస్త్రిపై జోకులు పేలుస్తున్నారు.. ‘‘ నీ ఫేవరేట్ ఆంధ్రా భోజనం ఫుల్‌గా తింటే ఇలాగే ఉంటుంది మరీ ’’ అంటూ కామెంట్ చేస్తున్నారు.. 

 

loader