తన స్పిన్ మాయాజాలంతో ఐపీఎల్‌లో అందరి చూపును తన వైపుకు తిప్పుకున్న అఫ్గానిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్.. టీ 20 బౌలర్ల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.. బంగ్లాదేశ్‌తో ముగిసిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 8 వికెట్లు పడగొట్టిన రషీద్... మొత్తం 813 పాయింట్లతో నెంబర్‌వన్‌గా కొనసాగుతున్నాడు.. బంగ్లా సిరీస్ తర్వాత 54 రేటింగ్ పాయింట్లను ఖాతాలో వేసుకున్న రషీద్ తన ర్యాంకును సుస్థిరం చేసుకున్నాడు. పాకిస్తాన్‌కు చెందిన షాదబ్ ఖాన్ కంటే రషీద్ కేవలం 80 పాయింట్ల ముందంజలో ఉండటంతో.. నెంబర్ మారుతుందేమోనని రషీద్ అభిమానులు భయపడ్డారు. అయితే తన మాయాజాలంతో బంగ్లా బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించి అగ్రస్థానాన్ని కాపాడుకున్నాడు. కాగా, ఆఫ్గాన్‌కే చెందిన మరో బౌలర్ 8వ స్థానంలో నిలిచాడు.