రాంచీ: తనకు ప్రాణహాని ఉందని గన్‌ లైసెన్స్ ఇవ్వాలని  క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని సతీమణి సాక్షి కోరారు.  ఈ మేరకు ఆమె పోలీసు అధికారులకు గన్ లైసెన్స్ కోసం  వినతిపత్రం సమర్పించారు.

క్రికెట్ మ్యాచ్‌ల దృష్ట్యా మహేంద్ర సింగ్ ధోని  ఇంట్లో తక్కువ సమయం ఉంటారని ఆమె చెప్పారు. తన కూతురితో కలిసి  తాను మాత్రమే ఇంట్లో ఒంటరిగా ఉంటున్నానని, ఏదైనా పని కోసం ఒంటరిగానే బయటకు వెళ్ళాల్సి వస్తోందని ఆమె చెప్పారు.

తన భద్రతను దృష్టిలో ఉంచుకొని  తనకు తుపాకీ లైసెన్స్ ఇవ్వాలని ఆమె  పోలీసు అధికారులను కోరారు. 20006లో క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని కూడ తుపాకీ లైసెన్స్ కోసం  ధరఖాస్తు చేసుకొన్నాడు. అయితే అతడికి 9 ఎంఎఎం  గన్ ను అనుమతిచ్చింది.

ప్రస్తుం క్రికెటర్ ధోని  ఐర్లాండ్ పర్యటనకు వెళ్ళనున్నారు.   యోయో టెస్టులో ధోని ఫాసయ్యారు. బెంగుళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో ప్రాక్టీస్ సెషన్స్‌లో ధోని పాల్గొంటున్నారు. ఐర్లాండ్ టీమ్‌తో భారత క్రికెట్ జట్టు రెండు టీ 20 మ్యాచ్‌లు ఆడనుంది. ఆ తర్వాత జూలై 3వ తేది నుండి ఇంగ్లాండ్ టీ 20 సీరీస్ లో పాల్గొననుంది.


భారత క్రికెట్‌ జట్టు మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ భార్య సాక్షి తనకు ప్రాణ హాని ఉందని, లైసెన్స్‌ తుపాకీ ఇప్పించాలని కోరినట్లు సమాచారం. ‘క్రికెట్‌ మ్యాచ్‌ల దృష్ట్యా ధోనీ ఇంట్లో ఉండే సమయం చాలా తక్కువ. నా కూతురితో కలిసి నేను మాత్రమే ఇంట్లో ఒంటరిగా ఉంటున్నా. ఏదైనా పని కోసం బయటకు వెళ్లాల్సి వచ్చినా ఒక్కదాన్నే వెళ్లాలి. నా భద్రతను దృష్టిలో పెట్టుకునే నాకు లైసెన్స్‌డ్‌ తుపాకీ లేదా రివాల్వర్‌ ఇప్పించాలి’ అని కోరినట్లు సాక్షి తెలిపింది.

2006లో మహేంద్ర సింగ్‌ ధోనీ కూడా తుపాకీ కోసం అప్లై చేయగా 9ఎమ్‌ఎమ్‌ గన్‌కు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ధోనీ.. ఐర్లాండ్‌ పర్యటనకు వెళ్లేందుకు సిద్ధమౌతున్నాడు. ఇటీవల నిర్వహించిన యో యో టెస్టులో పాసైన ధోనీ బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో ప్రాక్టీస్‌ సెషన్స్‌లో పాల్గొంటున్నాడు. ఈ నెల 27, 29న ఐర్లాండ్‌తో భారత్‌ రెండు టీ20లు ఆడనుంది. ఆ తర్వాత జులై 3 నుంచి ఇంగ్లాండ్‌తో భారత్‌ టీ20 సిరీస్‌ ఆడనుంది.