రంజాన్ వేళ.. సోషల్ మీడియాలో సానియా మీర్జా,రషీద్ ఖాన్ పోస్టులు వైరల్.
ముస్లింలు అత్యంతం పవిత్రంగా భావించే రంజాన్ మాసం రెండవ వారంలోకి ప్రవేశించింది. ఈ మాసం ప్రత్యేకత, ఉపవాస దీక్షలకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలో సానియా మీర్జా,రషీద్ ఖాన్ ,రానా సఫ్వీ వంటి క్రీడా కారులు, ప్రముఖులు వారి వారి ఇఫ్తార్ టేబుల్ నుండి ఆసక్తికరమైన సంఘటనలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. మీరు కూడా ఓ లూక్కేయండి.
ముస్లింలకు అత్యంత పవిత్రమైన మాసం రంజాన్. ఈ మాసంలో ముస్లింలు కఠిన ఉపవాస దీక్షలు చేపడుతారు. ఇస్లాం మత ఆచారాల ప్రకారం.. ఉపవాసాన్ని ప్రారంభించే ముందు.. ఉపవాసాన్ని విరమించిన తరువాత సెహ్రీ, ఇఫ్తార్ నిర్వహిస్తారు. ప్రతి ముస్లిం ఈ ఉపవాస దీక్షలను చేపడుతారు.
ఈ క్రమంలో సెహ్రీ, ఇఫ్తార్ వివరాలేంటి.. రంజాన్ ఉపవాస ప్రాముఖ్యతను వివరించే పలువురు పలు వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. సెలబ్రేటీలు, క్రికెటర్లు కూడా తమ సెహ్రీ, ఇఫ్తార్ సంబంధించిన వీడియోలను పంచుకుంటున్నారు. ఈ క్రమంలో సానియా మీర్జా నుండి రషీద్ ఖాన్ , రానా సఫ్వీ వరకు అందరూ వారి వారి ఇఫ్తార్ టేబుల్ నుండి ఆసక్తికరమైన సంఘటనలను పంచుకున్నారు.
భారత టెన్నిస్ స్టార్ టెన్నిస్ సంచలనం సానియా మీర్జా.. ఇటీవల టెన్నిస్ కు బైబై చెప్పిన విషయం తెలిసిందే. ఇక ఈ మాజీ టెన్నిస్ క్రీడాకారిణి తన పిల్లలు, ఇంటికి తన జీవితాన్ని పూర్తిగా అంకితం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఆమె సౌదీ అరేబియాలోని మక్కాను సందర్శించుకుని.. రంజాన్ పర్వదినానికి ముందు ‘ఉమ్రా’ చేసేందుకు అక్కడకి వెళ్లినట్లు తెలుస్తోంది . ఇందుకు సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా షేర్ చేసింది.
తాజాగా.. టెన్నిస్ సంచలనం సానియా మీర్జా "ఇఫ్తార్ విత్ మై" అనే క్యాప్షన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను షేర్ చేసింది . వీడియోలో.. ఇఫ్తార్ సమయంలో ఉపవాసం ఎలా విరమించాలో సానియా తన కొడుకుకు నేర్పించడం చూడవచ్చు. ఈ వీడియోకు 1.2M కంటే ఎక్కువ వ్యూస్, 176k లైక్‌లు,1k కంటే ఎక్కువ కామెంట్‌లు వచ్చాయి.
అలాగే.. ప్రస్తుతం కొనసాగుతున్న IPL సీజన్ 15లో గుజరాత్ టైటాన్స్ తరపున ఆడుతున్న ప్రముఖ ఆఫ్ఘన్ క్రికెటర్ రషీద్ ఖాన్, సెహ్రీ లు తమ ఇఫ్తార్ టేబుల్ కు ఆసక్తికరమైన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇందులో అతని సహచరుడు,కెప్టెన్ హార్దిక్ పాండ్యా, నూర్ అహ్మద్ లను కూడా చూపవచ్చు. సెహ్రీ విందు కోసం ఎరేటెడ్ డ్రింక్స్ నుండి పండ్లు, నాన్ వెజ్ ఐటమ్ అందుబాటులో ఉన్నాయి. రషీద్ ఖాన్ ఈ ఫోటోను తన ఇస్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేస్తూ.. "సెహ్రిఐఐఐఐఐఐఐఐ స్కిప్పర్‌తో మాతో చేరడం చాలా సంతోషం" అని క్యాప్షన్ పెట్టారు. ఈ పిక్‌కి 473 వేలకు పైగా లైక్‌లు,3.5 వేలకు పైగా కామెంట్‌లు వచ్చాయి.
ప్రముఖ చరిత్రకారులు, రచయిత రాణా సఫ్వీ ..ప్రత్యేక ఇఫ్తార్ విందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు.. రాణా తన స్నేహితురాలు మంజిలత్ ఫాతిమా కు స్పెషల్ రంజాన్ హలీమ్‌ను రుచి చూడాలని తన కోరికను వ్యక్తం చేస్తూ.. కలకత్తా నుండి ఢిల్లీకి అదే వంట చేసి కొరియర్ చేసింది.
ఇస్లాం క్యాలెండర్ ప్రకారం.. రంజాన్ తొమ్మిదో నెల.. ఈ నెలను ముస్లింలు చాలా పవిత్రంగా పరిగణిస్తారు. రంజాన్ నెల చంద్రుడు కనిపించిన తర్వాతే ప్రారంభమవుతుంది. ముస్లింలు వారి మత విశ్వాసాల ప్రకారం రంజాన్ మాసం మొత్తం ఉపవాస దీక్షలు చేపడుతారు. ఈ దీక్షలను మూడు అష్రాలుగా విభజించారు. తొలి పది రోజులను రహ్మత్ అని, తరువాతి 10 రోజులను బర్కత్ అని, చివరి 10 రోజులను మగ్ఫిరత్ అని అంటారు.