Asianet News TeluguAsianet News Telugu

రాజ్‌కోట్ టెస్ట్: మొదటిరోజు టీంఇండియాదే పైచేయి...భారత్ స్కోరు364/4

రాజ్ కోట్‌లో వెస్టిండిస్‌తో జరుగుతున్న మొదటి టెస్ట్ మొదటి రోజు భారత జట్టుదే పైచేయిగా నిలిచింది. మొదట బ్యాటింగ్ దిగిన భారత్ ఆదిలోనే ఓపెనర్ రాహుల్ వికెట్ ను కోల్పోయినా ఆ తర్వాత మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడింది. ఈ క్రమంలో ఆరంగేట్ర ఆటగాడు పృథ్విషా ఈ మ్యాచ్ లో సంచలనం సృష్టించాడు. ఆడిన మొదటి మ్యాచ్ లోనే శతకం సాధించి రికార్డులను తిరగరాశాడు. మరో ఆటగాడు పుజారా( 86 పరుగులు) సెంచరీకి చేరువలో ఉండగా ఔటయ్యాడు. 

rajkot test: india down first wicket
Author
Rajkot, First Published Oct 4, 2018, 10:18 AM IST

రాజ్ కోట్‌లో వెస్టిండిస్‌తో జరుగుతున్న మొదటి టెస్ట్ మొదటి రోజు భారత జట్టుదే పైచేయిగా నిలిచింది. మొదట బ్యాటింగ్ దిగిన భారత్ ఆదిలోనే ఓపెనర్ రాహుల్ వికెట్ ను కోల్పోయినా ఆ తర్వాత మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడింది. ఈ క్రమంలో ఆరంగేట్ర ఆటగాడు పృథ్విషా ( 134 ఔట్) ఈ మ్యాచ్ లో సంచలనం సృష్టించాడు. ఆడిన మొదటి మ్యాచ్ లోనే శతకం సాధించి రికార్డులను తిరగరాశాడు. మరో ఆటగాడు పుజారా( 86 పరుగులు) సెంచరీకి చేరువలో ఉండగా ఔటయ్యాడు. 

ఈ తర్వాత బ్యాటింగ్ దిగిన కోహ్లీ,రహానే జోడీ కూడా చక్కటి బాగస్వామ్యం నెలకొల్పారు. అయితే రహానే(41 పరుగులు) అర్థ శతకానికి చేరువవుతున్న క్రమంలో వికెట్ కోల్పోయాడు. కోహ్లీ( 72 పరుగులు) మాత్రం హాఫ్ సెంచరీని పూర్తి చేసుకుని సెంచరీ వైపు సాగుతున్పాడు. ప్రస్తుతం క్రీజులో కోహ్లీ, పంత్ ఉన్నారు.

మొదటిరోజు ఆట ముగిసే సమయానికి భారత్ 89 ఓవర్ల 4 వికెట్లు కోల్పోయి 364 పరుగులు చేసింది. వెస్టిండిస్ బౌలర్లు గాబ్రియెల్, బిషూ, లూవిస్, చేస్ లు తలో వికెట్ పడగొట్టారు. 

రాజ్ కోట్ టెస్టులో భారత జట్టు నాలుగో వికెట్  కోల్పోయింది. నిలకడగా ఆడుతూ మరో వికెట్ పడకుండా కోహ్లీ, రహానే జోడీ జాగ్రత్తగా పరుగులు సాధించింది. ఈ క్రమంలో కోహ్లీ అర్థ శతకాన్ని పూర్తి చేసుకోగా రహానే కూడా అందుకు దగ్గరయ్యాడు. అయితే 41 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రహీనే చేస్ బౌలింగ్ లో ఔటయ్యాడు.దీంతో 337 పరుగుల వద్ద టీంఇండియా నాలుగో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో కోహ్లీ ( 72 పరుగులు) రిషబ్ పంత్ (17 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు)

వెస్టిండీస్ పై జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్సులో సెంచరీతో అదరగొట్టి పృథ్వీ షా పెవిలియన్ చేరుకున్న తర్వాత కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ అజింక్యా రహాన్ నిలకడగా ఆడుతున్నారు. విరాట్ కోహ్లీ అర్థ సెంచరీ పూర్తి చేశాడు. 

టీమిండియా తరఫున అరంగేట్రం టెస్ట్ లోనే యువ సంచలనం పృథ్వీ షా సెంచరీతో రికార్డులు బద్ధలు కొట్టిన విషయం తెలిసిందే. వెస్టిండిస్ బౌలర్లపై విరుచుకుపడుతూ 99 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. అయితే సెంచరీ తర్వాత పృథ్విషా ఔటయ్యాడు. వెస్టిండిస్ బౌలర్ బిషు బౌలింగ్ లో అతడికే క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. పృథ్విషా 134 పరుగులు 154  బంతుల్లో చేసి పెవిలియన్ కు చేరాడు. దీంతో టీంఇండియా 232 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. 

రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌తో రాజ్‌కోట్‌లో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ రెండో వికెట్‌ను కోల్పోయింది. 86 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పుజారా ఔటయ్యాడు. కేఎల్ రాహుల్ వికెట్ పడిన తర్వాత పృథ్వీషాతో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దిన పుజారా స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.

వీరిద్దరూ రెండో వికెట్‌కు 206 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. సెంచరీకి చేరువ అవుతున్న సమయంలో షెర్మన్ బౌలింగ్‌లో డౌరిచ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో వీరిద్దరి భాగస్వామ్యానికి తెరపడింది. ప్రస్తుతం భారత్ 221 పరుగుల వద్ద ఉంది.. పృథ్వీ షా 126 పరుగులతోనూ.. కోహ్లీ 1 పరుగుతోనూ క్రీజులో ఉన్నారు. 

మరోవైపు తొలి టెస్టులో టీమిండియా ఓపెనర్ పృథ్వీ షా సెంచరీ చేశాడు.. తద్వారా అరంగేట్రం మ్యాచ్‌లోనే సెంచరీ చేసిన 15వ భారత ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. 101 బంతుల్లో 15 ఫోర్లతో షా సెంచరీ పూర్తి చేశాడు.

తొలి వికెట్ పడిన తర్వాత పుజారాతో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దుతున్న పృథ్వీ షా.. వన్డే తరహా ఆటతీరుతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు.. ఈ క్రమంలో ఇద్దరు రెండో వికెట్‌కు ద్విశతక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అంతకు ముందు టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

ఇంగ్లాండ్‌లో పర్యటించిన జట్టులో కొన్ని మార్పులతో భారత్ బరిలోకి దిగింది. మరోవైపు విండీప్ కెప్టెన్ హోల్డర్, సీనియర్ బౌలర్ కీమర్ రోచ్ లేకుండా బరిలోకి దిగుతోంది. క్రీజులో ఉన్న ఓపెనర్ పృథ్వీషా, చతేశ్వర్ పుజారా మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు నడుపుతున్నారు. 

59 ఏళ్ల రికార్డు బద్ధలు.. అరంగేట్రంలోనే పృథ్వీషా ఘనత

Follow Us:
Download App:
  • android
  • ios