కోహ్లీపై ప్రీతి జింటా ఒకే ఒక మాట: ఇప్పుడు ధోనీ సైడ్

కోహ్లీపై ప్రీతి జింటా ఒకే ఒక మాట: ఇప్పుడు ధోనీ సైడ్

హైదరాబాద్: కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సహ యజమాని, సినీ నటి ప్రీతి జింటా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని ఒకే ఒక పదంతో నిర్వచించారు. అద్భుతం అని ఆమె విరాట్ కోహ్లీ గురించి అన్నారు. తన ఫ్యాన్స్ తో ట్విట్టర్ సెషన్ నిర్వహించారు. ఆ సందర్భంగా ఆమె ఆ మాట అన్నారు. అతను అద్భుతం అని అన్నారు. 

తన జట్టు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ప్లే ఆఫ్ కు రాకపోవడంతో ఇప్పుడు తన అభిమాన జట్టు ఏదో కూడా చెప్పారు. తన జట్టు ఆటతీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆమె నాకౌట్స్ కు చేరుకున్న నాలుగు జట్లను ఆమె అభినందించారు. 

తన జట్టు ప్లే ఆఫ్ దశకు రాకపోవడంతో తన అభిమానాన్ని ఆమె చెన్నై సూపర్ కింగ్స్ మీద చూపిస్తున్నట్లు కనిపిస్తున్నారు. ఆమె తాజా ట్వీట్ ఆ విషయాన్ని తెలియజేస్తోంది. చాటింగ్ సెషన్ లోనే ప్రీతి జింటా చెన్నై సూపర్ కింగ్స్ కు మద్దతు ప్రకటించారు. 

ఐపిఎల్ టైటిల్ ఫేవరైట్ ఎవరని అడిగితే తాము ఆడడం లేదు కాబట్టి అన్ని జట్లను ఇష్టపడుతానని అనుకుంటున్నారా, తాను ధోనీ వైపు చూస్తున్నానని, అతను వెలిగిపోవాలని కోరుకుంటున్నానని అన్నారు. 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM SPORTS

Next page