ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ 

కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ సహ యజమాని, బాలీవుడ్‌ నటి ప్రీతి జింటా ముందే సంబరపడ్డారు. ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన జట్లేవో తెలిసిపోయింది. ఆఖరి బెర్తు కోసం రాజస్థాన్ రాయల్స్, ముంబయి ఇండియన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు పోటీపడిన విషయం తెలిసిందే . ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఓడిందని తెలియగానే ఆమె తెగ ఆనందపడిపోయారు. పక్కనే ఉన్న మరో సహ యజమానితో ఆమె మురిసిపోతూ ‘నిజంగా... నాకు చాలా సంతోషంగా ఉంది. ఈసారి ముంబై ఫైనల్‌కు వెళ్లడం లేదు. నేనైతే హ్యాపీ’ అని సంభాషిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు తమదైన స్థాయిలో కామెంట్లు చేస్తున్నారు. పంజాబ్‌పై చెన్నై 5 వికెట్ల తేడాతో విజయం సాధించి పాయింట్ల పట్టికలో రెండోస్థానంలో నిలిచింది.

Scroll to load tweet…