Asianet News TeluguAsianet News Telugu

పాపం పోలాండ్.. గెలిచినా ఇంటికే..(వీడియో)

పాపం పోలాండ్.. గెలిచినా ఇంటికే.. 

Poland beat Japan

హైదరాబాద్: ఎక్కడైనా గెలిచినవారు ఆ పై స్థానానికి చేరుకుంటారు. ఓడినవారు నిష్క్రమిస్తారు. కానీ ఫుట్‌బాల్‌లో అంతా రివర్స్‌గా ఉందే అనిపిస్తుంది గురువారం పోలాండ్, జపాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ చూసినవారికి. పాపం పోలాండ్ కిందా మీదా పడి మొత్తానికి 1-0 స్కోరుతో జపాన్‌పై విజయం సాధించింది. టోర్నీలో మొట్టమొదటి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. 

కానీ ఈ ఘనత ఎందుకు పనికి రాకుండా పోయింది. గ్రూప్  హెచ్‌లో ఆడిన తొలి రెండు మ్యాచ్‌లలో పొందిన ఓటమితో తాజా గెలుపు బూడిదలో పోసిన పన్నీరు అయిపోయింది. గెలుపును నెమరువెసుకుంటూ పోలాండ్ ప్లేయర్స్ టోర్నీ నుంచి నిష్క్రమించారు. 
 
అయితే ఓడిపోయిన జపాన్ మాత్రం సునాయాసంగా నాకౌట్‌కు చేరుకుంది. గ్రూప్‌లో చివరిదైన ఈ మ్యాచ్‌లో ఓడిపోయినప్పటికీ అంతకు ముందు ఆడిన మ్యాచుల్లో ఒక విజయం, ఒక డ్రా సాధించింది. అలా వచ్చిన నాలుగు పాయింట్లతో నాకౌట్‌కు చేరుకుంది.

మ్యాచ్ ఫస్టాఫ్ అంతా ఇరు జట్లు నువ్వా నేనా అన్న రీతిలో ఆడటంతో ఒక్క గోల్ కూడా చేయలేకపోయాయి. సెకండాఫ్‌లో సైతం దాదాపు ఇదే పరిస్థితి పునరావృతమనట్టు కనిపించింది. కానీ 59వ నిముషంలో పోలాండ్ ప్లేయర్ జాన్ బెడ్‌నారెక్ గోల్ చేశాడు. సొంత జట్టుకు ఆధిక్యత తెచ్చి పెట్టాడు. 

ఆ తర్వాత అందివచ్చిన అదనపు సమయంలోనూ ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. దాంతో పోలాండ్ 1-0తో మ్యాచ్‌ను తనదిగా చేసుకుంది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా జాన్ బెడ్‌నారెక్ నిలిచాడు.
 

"

Follow Us:
Download App:
  • android
  • ios