1 బాల్ కు 17 పరుగులు చేసిన బ్యాట్స్‌మన్ ఎవరో తెలుసా?
cricket records : అంతర్జాతీయ క్రికెట్‌లో 1 బాల్‌కు 17 పరుగులు వస్తాయని ఏవరూ ఊహించలేదు. ఎందుకంటే అది అసాధ్యం. కానీ, అలాంటి అరుదైన రికార్డును భారత స్టార్ ప్లేయర్ సాధించాడు.
cricket records : క్రికెట్ లో అసాధ్యం అనుకున్న విషయాలుల ఒక్కో సారి ఊహించని విధంగా సుసాధ్యం అవుతుంటాయి. అలాంటి రికార్డులు చాలానే ఉన్నాయి. అలాంటి అసాధారణ రికార్డు ఒక బాల్ కు 17 పరుగులు చేయడం. ఇది కూడా ఒక భారత క్రికెటర్ ఈ రికార్డును సాధించాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో 1 బాల్‌కు 17 పరుగులు చేసిన ప్రపంచ రికార్డు ఒక భారత బ్యాట్స్‌మన్ పేరు మీద ఉంది. అంతర్జాతీయ క్రికెట్‌లో రోహిత్ శర్మ, క్రిస్ గేల్ వంటి హిట్టర్స్ కూడా 1 బంతికి 17 పరుగుల ఘనతను అందుకోలేకపోయారు.
అంతర్జాతీయ క్రికెట్‌లో 1 బంతికి 17 పరుగులు చేసిన ఘనత టీమిండియా మాజీ ప్లేయర్, డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సాధించాడు. మార్చి 13, 2004న కరాచీలో పాకిస్థాన్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో పాకిస్థాన్ బౌలర్ రాణా నవేద్ ఉల్ హసన్ వేసిన ఒక ఓవర్‌లో ఒక బంతికి 17 పరుగులు వచ్చాయి.
ఇప్పటి వరకు వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉన్న ఈ ప్రపంచ రికార్డును ప్రపంచంలోని ఏ బ్యాట్స్‌మెన్ కూడా బ్రేక్ చేయలేకపోయాడు. ఆ ఓవర్‌లో వీరేంద్ర సెహ్వాగ్ ముందు పాకిస్తాన్ బౌలర్ రాణా నవేద్ ఉల్ హసన్ తన ఓవర్ లో వరుసగా 3 నో బాల్స్ వేశాడు. అందులో వీరేంద్ర సెహ్వాగ్ రెండు బంతుల్లో ఫోర్లు కొట్టాడు. దీని తర్వాత లీగల్ బాల్‌లో పరుగులేమీ రాలేదు. దీని తర్వాత రాణా నవేద్ ఉల్ హసన్ మళ్లీ రెండు నో బాల్‌లు వేశాడు. అందులో వీరేంద్ర సెహ్వాగ్ ఫోర్ కొట్టగా, రెండో బంతికి పరుగులేమీ రాలేదు. ఈ విధంగా, రాణా నవేద్ ఉల్ హసన్ వేసిన ఆ ఓవర్‌లో, వీరేంద్ర సెహ్వాగ్ 3 ఫోర్లతో 12 పరుగులు, 5 నో బాల్స్ కు 5 అదనపు పరుగులు వచ్చాయి. దీంతో ఒక బాల్ పూర్తితో మొత్తం 17 పరుగులు వచ్చాయి.
Virender Sehwag, Yashasvi Jaiswal
కాగా, వీరేంద్ర సెహ్వాగ్ భారత్ తరఫున 104 టెస్టుల్లో 49.34 సగటుతో 8586 పరుగులు చేశాడు. ఇందులో 23 సెంచరీలు, 32 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అతని అత్యుత్తమ స్కోరు 319. వీరూ 251 వన్డేల్లో 15 సెంచరీలు, 38 హాఫ్ సెంచరీలతో 8273 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్‌లో వీరూ అత్యుత్తమ స్కోరు 219. ఇది కాకుండా, వీరూ 19 టీ20 మ్యాచ్‌లలో 394 పరుగులు చేశాడు. ఇందులో 68 పరుగులు అతని అత్యధిక స్కోరు.