Rohan Bopanna: "ప్రతిభకు వయస్సు అడ్డంకి కాదు.." రోహన్ బోపన్నపై ప్రధాని ప్రశంసలు
Rohan Bopanna: ఆస్ట్రేలియన్ ఓపెన్ లో డబుల్స్ విజేతగా రోహన్ బోపన్న నిలిచి సరికొత్త చరిత్ర సృష్టించారు. 43 ఏళ్ల వయసులో ఓ గ్లాండ్ స్లామ్ టోర్నీలో విజేతగా నిలవడం మామూలు విషయం కాదు. అద్బుత ప్రదర్శన ఇచ్చిన రోహన్ బోపన్నపై ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Rohan Bopanna: భారత దిగ్గజ టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న సరికొత్త చరిత్ర సృష్టించారు. 43 ఏళ్ల వయసులో ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల డబుల్స్ టైటిల్ విజేతగా నిలిచారు. దీంతో గ్రాండ్‌స్లామ్ గెలిచిన ప్రపంచంలోనే అత్యంత పెద్ద వయస్కుడైన రికార్డు క్రియేట్ చేశారు. రోహన్ తన భాగస్వామి మాథ్యూ ఎబ్డెన్‌తో కలిసి ఇటలీకి చెందిన సిమోన్ బోలెల్లి -ఆండ్రియా వవసోరిలపై 7-6, 7-5 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించారు.
రోహన్ తన కెరీర్‌లో తొలి పురుషుల డబుల్స్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. అంతేకాదు.. పురుషుల డబుల్స్ గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలుచుకున్న మూడో భారతీయుడిగానూ రోహన్ రికార్డుల్లోకెక్కాడు. అంతకుముందు.. అతను 2017 ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్‌లో ఛాంపియన్‌గా నిలిచాడు.
ఇలాంటి చారిత్రాత్మక విజయం సాధించిన రోహన్ బోపన్నపై ప్రశంసల వర్షం కురుస్తోంది. పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు, క్రీడాకారులు ఆయనకు శుభకాంక్షలు తెలుపుతున్నారు. ఈ తరుణంలో రోహన్ బోపన్న సాధించిన అద్భుత విజయాన్ని ప్రధాని మోడీ ట్వీట్ చేస్తూ ప్రశంసించారు. ప్రతిభకు వయసు అడ్డంకి కాదని మరోసారి నిరూపితమైందని, మన శక్తిసామర్థ్యాలను ఎల్లప్పుడూ నిర్వచించేది మన కృషి, పట్టుదల అని వివరించారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ లో విజేతగా నిలిచిన రోహన్ బోపన్నకు అభినందనలు... తన సుదీర్ఘ టెన్నిస్ కెరీర్ లో ఎందరికో ఆదర్శంగా నిలిచారని కీర్తించారు.
రోహన్‌కు పద్మశ్రీ అవార్డు
క్రీడా రంగంలో అసాధారణ విజయాలు సాధించినందుకు గాను రోహన్ బోపన్న దేశ అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. గత మంగళవారం రోహన్‌కు పద్మశ్రీ అవార్డు ప్రకటించగా, శనివారం నాడు తన ఆటతో దానిని అర్థవంతం చేసి తనకు ఈ గౌరవం ఎందుకు వచ్చిందో చాటి చెప్పాడు.
43 ఏళ్ల వయసులో గ్రాండ్‌స్లామ్
పద్మశ్రీ అవార్డు అందుకున్న నాలుగు రోజుల్లోనే రోహన్ బోపన్న ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల డబుల్స్ ఫైనల్ ఆడాడు. ఫైనల్‌లో రోహన్ ఎంత అద్భుతంగా ఆడాడు. 43 ఏళ్ల వయసులో కూడా అద్భుత ఉత్సాహాన్ని ప్రదర్శించి వరుస సెట్లలో తన భాగస్వామితో కలిసి గ్రాండ్ స్లామ్ గెలుచుకుంది. టెన్నిస్ చరిత్రలో 43 ఏళ్ల వయసులో ఏ ఆటగాడు గ్రాండ్‌స్లామ్ గెలవలేదు. అంతకుముందు 2022లో మార్సెలో అరెవోలాతో కలిసి 40 ఏళ్ల వయసులో ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల డబుల్స్ ట్రోఫీని జీన్ జూలియన్ రోజర్ గెలుచుకున్నారు. ఈ రికార్డును బద్ధలుకొట్టారు బోపన్న.
ర్యాంకింగ్‌లో నంబర్‌వన్
ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ గెలిచిన తర్వాత, రోహన్ బోపన్న WTA పురుషుల డబుల్స్ ర్యాంకింగ్స్‌లో కూడా నంబర్ వన్ ఆటగాడిగా నిలిచాడు. దీని అధికారిక ప్రకటన సోమవారం వెలువడనున్నప్పటికీ.. రోహన్ ర్యాంకింగ్‌లో నంబర్ వన్ కావడం ఖాయం.