దోహా డైమండ్ లీగ్‌లో సత్తా చాటిన నీరజ్ చోప్రా.. ప్రధాని మోదీ అభినందనలు..

దోహా డైమండ్ లీగ్‌లో మొదటి స్థానంలో నిలిచిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. 

PM Modi congratulates Neeraj Chopra for first position in Doha Diamond League ksm

రెండేండ్ల క్రితం  టోక్యో (జపాన్) వేదికగా ముగిసిన  ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన  జావెలిన్ త్రోయర్  నీరజ్ చోప్రా మరోసారి అంతర్జాతీయ వేదిక మీద సత్తా చాటాడు.  దోహా వేదికగా శుక్రవారం రాత్రి (భారత కాలమానం ప్రకారం) ముగిసిన  దోహా డైమండ్ లీగ్ -2023లో టైటిల్ కొట్టాడు. తొలి అంచె పోటీలలో టైటిల్ నెగ్గాడు. ఈ సందర్భంగా నీరజ్ చోప్రాకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. నీరజ్ చోప్రా భవిష్యత్తు ప్రయత్నాలకు కూడా మోదీ బెస్ట్ విషెస్ తెలియజేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్‌లో ఓ పోస్టు చేశారు. 

‘‘సంవత్సరంలో మొదటి ఈవెంట్.. మొదటి స్థానం! 88.67 మీటర్ల త్రోతో.. దోహా డైమండ్ లీగ్‌లో నీరజ్ మెరిశాడు. అతనికి అభినందనలు! మున్ముందు ప్రయత్నాలకు శుభాకాంక్షలు’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. 

 


ఇక, దోహా డైమండ్ లీగ్-2023లో భాగంగా శుక్రవారం రాత్రి  నీరజ్ చోప్రా.. ఫస్ట్ అటెంప్ట్ లోనే  88.67 మీటర్ల దూరం విసిరి  తన విజయాన్ని ఖాయం చేసుకున్నాడు.  తన సమీప  ప్రత్యర్థి జాకబ్ వాద్లిచ్  కూడా నీరజ్ కు దగ్గరగా వచ్చాడు. వాద్లిచ్  88.63 మీటర్ల దూరంతో రెండో స్థానంలో నిలిచాడు. ఫస్ట్ త్రో లోనే  88.67 మీటర్ల దూరం విసిరిన నీరజ్ తర్వాత  మాత్రం  ఆ దూరాన్ని దాటలేకపోయాడు. ఈ సీజన్ లో ‘టార్గెట్ 90’గా పెట్టుకున్న ఈ గోల్డెన్ బాయ్.. దోహాలో కూడా తృటిలో దానిని మిస్ అయ్యాడు. 

నీరజ్ త్రో వివరాలు :  (మొత్తం ఆరు  ప్రయత్నాలలో) 
1. 88.67 మీటర్లు 
2. 86.04 మీటర్లు
3. 85.47 మీటర్లు
4. ఫౌల్  
5. 84.37 మీటర్లు
6. 86.52 మీటర్లు 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios