వినేష్ ఫోగట్ చేతిలో ఓడినా ఫైనల్ కు చేరిన క్యూబా రెజ్లర్ గుజ్మాన్ లోపెజ్
Paris 2024 Olympics: పారిస్ ఒలింపిక్స్ 50 కేజీలో రెజ్లింగ్ విభాగంలో ఫైనల్ కు చేరిన భారత స్టార్ వినేష్ ఫోగట్ పై అనర్హత వేటు పడింది. దీంతో అమె చేతిలో ఓడిన క్యూబా రెజ్లర్ గుజ్మాన్ లోపెజ్ ఇప్పుడు ఫైనల్ కు చేరారు.
Paris 2024 Olympics: 50 కేజీల మహిళల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ సెమీఫైనల్స్‌లో వినేష్ ఫోగాట్ చేతిలో ఓడిపోయిన క్యూబాకు చెందిన యుస్నీలిస్ గుజ్మాన్ లోపెజ్ ఇప్పుడు పారిస్ ఒలింపిక్స్ లో ఫైనల్ కు చేరారు. బుధవారం వెయిట్ కట్ చేయడంలో విఫలమైనందుకు వినేష్ ఫొగట్ అనర్హత వేటు పడింది. దీంతో ఆమె గోల్డ్ మెడల్ రౌండ్ తో పాటు మొత్తం టోర్నీ నుంచి ఔట్ అయ్యారు.
వినేష్ 5-0తో గుజ్మాన్ లోపెజ్‌ను ఓడించి ఒలింపిక్ ఫైనల్‌కు చేరుకున్న తొలి భారతీయ రెజ్లర్‌గా అంతకుముందు రికార్డు సృష్టించారు. అయితే, ఆమె గోల్డ్ మెడల్ బౌట్ రోజున వినేష్ ఫోగట్ అధిక బరువు కారణంగా అనర్హతకు గురయ్యారు. ఆమె బరువు తగ్గించే సమయంలో 100 గ్రాముల కంటే కొంచెం ఎక్కువ బరువు వుండటంతో అర్హత సాధించడంలో విఫలమయ్యారు.
“వినేష్ ఫోగట్ రెండవ రోజు బరువులో విఫలమయ్యారు. ఇంటర్నేషనల్ రెజ్లింగ్ రూల్స్ ఆర్కికల్ 11 ప్రకారం, సెమీఫైనల్‌లో ఆమెపై ఓడిన రెజ్లర్ వినేష్ స్థానంలో ఉంటుంది. కాబట్టి యుస్నీలిస్ గుజ్మాన్ లోపెజ్ (క్యూబా) ఫైనల్‌లో పోటీపడతారు” అని ఒలింపిక్ నిర్వాహకులు అధికారిక ప్రకటనలో తెలిపారు.
ఓపెనింగ్ రౌండ్‌లో వినేష్ ఫోగట్ తో తొలి అంతర్జాతీయ బౌట్‌లో ఓడిన టాప్-సీడ్ జపాన్ రెజ్లర్ యుయి సుసాకి, ఉక్రెయిన్‌కు చెందిన ఒక్సానా లివాచ్ మధ్య జరిగిన రెపిచేజ్ బౌట్‌లో భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ తో 5-7 తేడాతో ఓటమి పాలైనట్లు ప్రకటన పేర్కొంది. క్వార్టర్ ఫైనల్స్, ఇప్పుడు కాంస్య పతక మ్యాచ్ అవుతుంది.