గంభీర్ ది బెస్ట్ కోచ్.. పొగడ్తలతో ముంచెత్తిన తెలుగబ్బాయ్.. ఇంతకీ ఎవరంటే.?
Gambhir: టీమిండియా యువ ప్లేయర్ తిలక్ వర్మ తన ఆత్మవిశ్వాసం, ఆటతీరు మెరుగుపడటంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పాత్ర ఉందని తెలిపాడు. గంభీర్ ప్రాక్టీస్ లో ఛాలెంజింగ్ పరిస్థితులు కల్పించి

టీ20 జట్టులో సుస్థిర స్థానం..
భారత క్రికెట్ జట్టులోని స్టార్ బ్యాటర్‌లో ఒకరు తిలక్ వర్మ. ఇప్పటికే T20 జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న ఈ యువ బ్యాట్స్‌మెన్, ప్రస్తుతం వన్డే టీమ్‌లో చోటు దక్కించుకోవాలని ఆశిస్తున్నాడు. తన ఆత్మవిశ్వాసం, ఆటతీరుపై మరింత స్పష్టత పెరగడానికి టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కోచింగ్ ఎంతగానో సహాయపడిందని తిలక్ వర్మ వెల్లడించాడు. గంభీర్ మార్గదర్శకత్వంలో ప్లేయర్‌గా మరింత ఎదిగే అవకాశం లభించిందని తిలక్ అభిప్రాయపడ్డాడు. త్వరలోనే అతనికి వన్డే టీమ్‌లోకి ఎంట్రీ లభించే అవకాశాలు లేకపోలేదు.
T20 టీమ్‌లో తిలక్‌కు కీలక పాత్ర
ఇటీవల టీమ్, ప్లేయర్స్ ఎంపికకు సంబంధించి గౌతమ్ గంభీర్ తీసుకుంటున్న నిర్ణయాలపై అభిమానుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నప్పటికీ, తిలక్ వర్మ విషయంలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. గంభీర్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తిలక్ T20 టీమ్‌లో కీలక పాత్ర పోషించాడు. 2025 ఆసియా కప్ ఫైనల్‌లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో తిలక్ వర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కూడా గెలుచుకున్నాడు.
ఇండియా A జట్టు కెప్టెన్‌గా తిలక్
ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌కు కూడా తిలక్ వర్మ సెలెక్ట్ అయిన సంగతి తెలిసిందే. శ్రేయస్ అయ్యర్, శుభ్‌మాన్ గిల్ గాయాల కారణంగా అందుబాటులో లేకపోవడంతో ఈ హైదరాబాద్ యువ ప్లేయర్‌కు అవకాశం దక్కింది. అయ్యర్ స్థానంలో తిలక్ వర్మ ప్లేయింగ్ 11లో చోటు దక్కించుకుంటారని చాలా మంది అంచనా వేశారు. అయితే, రుతురాజ్ గైక్వాడ్‌కు ఆ అవకాశం దక్కింది. అంతకుముందు ఇండియా A జట్టు కెప్టెన్‌గా కూడా తిలక్ ఎంపికయ్యాడు, ఇది అతని నాయకత్వ లక్షణాలకు నిదర్శనం.
ప్రాక్టీస్‌లో మ్యాచ్‌లను పోలిన పరిస్థితులు..
గంభీర్ తనను నిరంతరం ప్రోత్సహిస్తూనే ఉంటారని, అన్ని ఫార్మాట్లలో విజయం సాధించగల సామర్థ్యం తనలో ఉందని చెప్తారని తిలక్ వర్మ పేర్కొన్నాడు. "గౌతమ్ సార్ ఎప్పుడూ నాకు ఆత్మవిశ్వాసం ఇస్తారు. ప్రాక్టీస్‌లో మ్యాచ్‌లను పోలిన పరిస్థితులు సృష్టించి ఛాలెంజ్ చేస్తారు. ఒత్తిడిలో కఠినమైన నిర్ణయాలు తీసుకునేలా చేస్తారు" అని తిలక్ తెలిపాడు.
మ్యాచ్‌లలో ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో..
"మ్యాచ్‌లలో ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో నేర్చుకునేలా ప్రాక్టీస్ సెషన్లలో నన్ను ఒత్తిడికి గురిచేస్తారు. నాకు సామర్థ్యం ఉందని నమ్ముతున్నందున గంభీర్ నన్ను ఛాలెంజ్ చేస్తూనే ఉన్నారు. ఇదే నిజమైన మ్యాచ్‌లలో కూడా ప్రశాంతంగా ఇన్నింగ్స్‌లను ముగించడానికి నాకు సహాయపడుతుంది" అని తిలక్ వర్మ వివరించాడు. గంభీర్ కోచింగ్ స్టైల్ తిలక్ వర్మ ఆటను మరింత మెరుగుపరచి, భవిష్యత్తులో భారత క్రికెట్‌కు కీలక ఆటగాడిగా నిలిచేందుకు దోహదపడుతుందని చెప్పడంలో సందేహం లేదు.

