ఇంగ్లండ్ పనామాను ఉతికి 'ఆరే' సింది..!

ngland defeat Panama with six goals
Highlights

కెప్టెన్ హ్యారీ కేన్ హ్యాట్రిక్

హైదరాబాద్: ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ కేన్‌ కాలికి బాల్ కట్టుకొని ఆడాడా అనిపిస్తుంది గ్రూప్-జిలో పనామాపై ఇంగ్లండ్ 6-1తో సాధించిన విజయం చూస్తే. ఆదివారంనాటి ఒక్క మ్యాచ్‌తోనే వ్యక్తిగత రికార్డులకు తోడు సొంత జట్టుకు రికార్డు కట్టబెట్టాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ తరఫున మొదటి రెండు మ్యాచ్‌లలోనూ గోల్ సాధించిన రెండో ఆటగాడిగా, హ్యాట్రిక్ సాధించిన మూడో ఆటగాడిగా సంచలనం సృష్టించాడు. అత్యంత గోల్స్ కొట్టిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానాన్ని పదిలపరుచుకున్నాడు. ఫస్టాఫ్‌లో ఐదు గోల్స్ సాధించడం ఇంగ్లాండ్‌కు ఇదే తొలిసారి. అంతేకాదు ఫస్ట్ టైమ్ ఆరు గోల్స్ చేసింది.


కెప్టెన్ హ్యారీ 22వ, 45వ మరియు 62వ నిముషంలో చేసిన మూడు గోల్స్‌తో పనామాను చిత్తు చిత్తుగా ఓడించడంలో కీలక పాత్ర పోషించాడు. అతడికి తోడుగా డిఫెండర్ స్టోన్స్ 8వ, 40వ నిముషం వద్ద రెండు గోల్స్ చేశాడు. నేనేం తక్కువ తిన్నానా అన్నట్టుగా 36వ నిముషంలో లింగార్డ్ గోల్ చేయడంతో ఇంగ్లండ్ బ్రహ్మాండమైన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.


ఆట ఆరంభమైన తర్వాత 8వ నిముషంలో తొలి గోల్ చేసిన ఇంగ్లండ్, ఫస్టాఫ్ ముగిసేసరికి 5-0తో తొలిసారిగా కనీవినీ ఎరుగని ఆధిక్యాన్ని సాధించింది. సెకాండాఫ్‌లోనూ అదే జోరు కొనసాగించిన ఫేవరెట్ టీమ్ కెప్టెన్ కేన్ 62వ నిముషంలో చేసిన గోల్‌తో 6-0 చేసింది. అయితే అంత ఒత్తిడిలోనూ, చివరి నిముషంలోనూ పోరాడేందుకు పనామా ప్లేయర్స్ ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో 78వ నిముషంలో బల్వోయి వరల్డ్ కప్ హిస్టరీలో పనామా టీమ్‌కు ఫస్ట్ గోల్ అందించాడు. ఆఖరికి మ్యాచ్ ముగిసే సమయానికి 6-1తో ఇంగ్లండ్ మ్యాచ్ కైవసం చేసుకుంది. ఈ విజయంతో ఇంగ్లండ్ ప్రీ క్వార్టర్స్‌కు చేరుకుంది.

loader