కెప్టెన్ కూల్ గా తనకంటూ  ప్రత్యేకమైన ఆటతీరుతో, కెప్టెన్సీతో అదరగొట్టిన టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఇవాళ 37 వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న ఈ డాషింగ్ మ్యాచ్ ఫినిషర్ తన భార్య సాక్షి, కూతురు జీవా తో పాటు సహచర ఆటగాళ్లతో కలిసి పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బర్త్ డే కేక్ కట్ చేసిన మహీ కి అక్కడున్న వారు శుభాకాంక్షలు తెలిపారు. 

ఈ జార్ఖండ్ డైనమైట్ కి మాజీ క్రికెటర్లు, బాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇక అభిమానులు కూడా తమ అభిమాన ఆటగాడి పుట్టినరోజును ఘనంగా జరుపుకుంటూ సోషల్ మీడియాను మహీ ఫోటోలు, వీడియోలు, పుట్టిన రోజు విషెస్ కామెంట్స్ తో నింపేస్తున్నారు.

అయితే మహేంద్ర సింగ్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో ఎవరెవరు ఎలా విషెస్ తెలిపారో ఓసారి చూద్దాం.

వీరేంద్ర సెహ్వాగ్ :  ఎమ్ఎస్ కు భర్త్ డే విషెస్ ని తనదైన హాస్యోక్తులతో తెలియజేశాడు డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వగ్ . ధోని కాళ్లను వెడల్పుగా చాపి స్టంపౌట్ కాకుండా జాగ్రత్తపడిన ఓ పోటో ను పోస్ట్ చేసిన వీరూ, ఇంతకంటే సుధీర్ఘంగా నీవు జీవించాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు.  అతడి స్టంపింగ్ వేగం కంటే తొందరగా ఆనందం అతడికి లభించాలన్నారు. చివరగా ఓం ఫినిషాయ నమ: అంటూ వీరూ విష్ చేశారు.

 

సచిన్ టెండూల్కర్ : పుట్టినరోజు జరుపుకోవడంతో పాటు త్వరలో 500వ ఇంటర్నేషనల్ మ్యాచ్ అడుతున్నందుకు ధోనికి శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు క్రికెట్ గాడ్ సచిన్ ట్వీట్ చేశారు. ధోనీ  ఇలాగే చుట్టూ ఉన్నవారికి ఆనందాన్ని, ఉత్సాహాన్ని పంచుతుండాలని కోరుకుంటున్నట్లు సచిన్ తెలిపారు.

 
 ధోని భార్య సాక్షి: తన జీవితానికి అత్యంత ప్రత్యేకమైన వ్యక్తికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నట్లు సాక్షి ట్వీట్ చేశారు. ధోనిది ఎంత గొప్ప వ్యక్తాత్వమో చెప్పడానికి మాటలు చాలవన్నారు. గత పదేళ్లుగా ధోని నుండి ఎన్నో నేర్చుకున్నానని, వాటిని ఇలాగే కొనసాగిస్తున్నాని అన్నారు. తనకు ఎంతో ప్రేమను పంచుతూ జీవితాన్ని ఆనందంగా గడపడానికి తోడుంటున్నందుకు ధోనీకి ధన్యవాదాలు తెలిపింది. 
 

 

విరాట్ కోహ్లీ : '' నీతో కలిసి టీం ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తుండటం ఎంతో ఆనందంగా, గర్వంగా ఫీలవుతుంటా. టీం సభ్యుల్లో ఉత్సాహాన్ని నింపడానికి మీరు పడే తాపత్రయాన్ని నేను మాటల్లో వివరించలేను'' అంటూ విరాట్ ధోనితో కలిసున్న ఫోటోను జతచేస్తూ ట్వీట్ చేశారు.


 
 

 సురేష్ రైనా : ''నీలాంటి ఉన్నతమైన వ్యక్తి పుట్టినరోజు జరుపుకుంటున్న సమయంలో 500 వ మ్యాచ్ వైపు ప్రయాణం సాగుతుండటం ఎంతో గర్వకారణం.   హ్యాపీ భర్త డే బ్రదర్. నాకు ఇప్పడూ, ఎప్పుడూ నువ్వే స్పూర్తి'' అంటూ దోనితో ్లిసున్న పోటోలను జతచేస్తూ రైనా ట్వీట్ చేశారు.

 

బిసిసిఐ : 37 వ పుట్టిన రోజు జరుపుకుంటున్న ఎమ్ఎస్ ధోని కి బిసిసిఐ శుభాకాంక్షలు తెలిపింది.   బిసిసిఐ తన అధికారిక ట్విట్టర్ లో ధోనికి విష్ చూస్తూ ఓ ట్వీట్ చేసింది.