Asianet News TeluguAsianet News Telugu

ICC World cup 2023: సెమీస్ ముంగిట టీమిండియాకు టెన్షన్.. గాయాల బారినపడుతున్న ఆటగాళ్లు..

ICC World cup 2023: ప్రపంచకప్ మెగాటోర్నీలో టీమిండియా జైత్రయాత్ర కొన‌సాగుతోంది. ఈ టోర్నీలో ఓటమి ఎరుగని టీమిండియా ప్రధాన ఫేవరెట్‍గా ఉన్నా కొందరి ఫామ్, మరికొందరు ఆటగాళ్ల గాయాలు కాస్త ఆందోళన కలిగిస్తున్నాయి.

Mohammed Siraj sustains a blow near the throat while attempting a catch leave the field temporarily KRJ
Author
First Published Nov 13, 2023, 6:57 AM IST

ICC World cup 2023: ప్ర‌పంచ‌క‌ప్‌ 2023లో టీమిండియా జైత్రయాత్ర కొన‌సాగుతోంది. లీగ్ దశలో ఇప్పటి వరకు ఆడిన  తొమ్మిది మ్యాచులకు తొమ్మిది మ్యాచులు గెలిచింది. ఈ మహా టోర్నీలో ఓట‌మి ఎగుర‌ని జ‌ట్టుగా భారత్ నిలిచి సెమీస్ లోకి అడుగుపెట్టింది. అయితే.. సెమీస్ ముంగిట టీమిండియాలో గాయాల టెన్షన్ పట్టుకుంది. ఇప్పటికే భారత జట్టులో స్టార్ ఆల్ రౌండర్ గా కొనసాగుతున్న హార్దిక్ పాండ్యా వరల్డ్ కప్ లో మంచి ప్రదర్శన కనబరిచాడు. కానీ అనూహ్యంగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో ఈ స్టార్ ఆల్ రౌండర్ గాయం బారిన పడ్డాడు.

చీలమండ గాయం బారిన పడిన అతను బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో వైద్యుల ఆధ్వర్యంలో చికిత్స తీసుకుంటున్నాడు. వర్డల్ కప్ చివరి మ్యాచ్ ల్లోనైనా అందుబాటులో ఉంటాడని భావించిన ఫలితం లేకుండా పోయింది. అతనికి తీవ్ర గాయం కావడంతో వరల్డ్ కప్ టోర్నీ పూర్తిగా నిష్క్రమించాడనే విషయం తెలిసిందే. నిజానికి హార్థిక్ పాండ్యా లోటు టీమిండియాలో కొట్టోచ్చినట్టు కనిపిస్తుంది. ప్రస్తుతం టీమిండియా ఆరుగురు బ్యాటర్లు, ఐదుగురు బౌలర్లు మాత్రమే బరిలోకి దిగుతుంది. హార్దిక్ దూరమయ్యాగా.. అతని స్థానంలో సరైన ఆటగాడు కరువయ్యాడు. 

ఇలాంటి  తరుణంలో టీమిండియాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆదివారం నాడు బెంగుళూర్ లోని చిన్న స్వామి స్టేడియం వేదికగా నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో పేసర్ మహ్మద్ సిరాజ్ గాయపడ్డారు. బౌండరీ లైన్ కు సమీపంలో ఫీల్డింగ్ చేసిన సిరాజ్ క్యాచ్ పట్టుకునే సమయంలో విఫలమై గాయపడ్డాడు. ఆ తరువార మైదానాన్ని వీడాల్సి వచ్చింది. 
కుల్దీప్ యాదవ్ వేసిన 14 వ ఓవర్లో నెదర్లాండ్ బ్యాట్స్ మెన్ డచ్ బ్యాటర్ మ్యాక్స్ ఒడౌడ్ భారీ షాట్‌కు ప్రయత్నించాడు. ఆ బంతిని అందుకునేందుకు సిరాజ్ ప్రయత్నించారు. కానీ ఆ బంతి వస్తున్న తీరును సరిగా గమనించలేకపోయాడు. ఈ క్రమంలో ఆ బంతి సిరాజ్ గొంతుకు బలంగా తాకింది. దీంతో సిరాజ్ వెంటనే కింద పడిపోయాడు. వెంటేనే ఫిజియో థేరపి వచ్చి..సిరాజ్ ను  పరీక్షించాడు. 

ఈ క్రమంలో విశ్రాంతి తీసుకోవాలని సూచించడంతో సిరాజ్ మైదానాన్ని వీడాడు. సెమీస్ ముంగిట సిరాజ్ గాయపడటంతో టీమిండియా అభిమానులు టెన్షన్ పడ్డారు. అయితే.. అది తీవ్రమైన గాయం కాదని తేలింది. సిరాజ్ కాసేపటి తర్వాత తిరిగి మైదానంలో అడుగుపెట్టడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by CricTracker (@crictracker)

వాస్తవానికి బ్యాకప్ పేసర్‌గా ప్రసిద్ధ్ కృష్ణ అందుబాటులో ఉన్నప్పటికీ.. ఇలాంటి కీలక సమయంలో సిరాజ్‌ స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేరని చేపట్టాలి. ఈ ట్రోర్నీలో భారత పేస్ త్రయం బుమ్రా, సిరాజ్, షమీ దుమ్మురేపుతున్నారు. ప్రత్యర్థి బ్యాట్స్ మెన్స్ కు చుక్కలు చూపిస్తున్నారు. ఇప్పటికి వరకూ షమీ, బుమ్రా తలో 16 వికెట్లు తీయగా.. సిరాజ్ 11 వికెట్లు తీశారు. ప్రత్యర్థి బ్యాట్స్ మెన్స్ ను కట్టడి చేయడం లో  సఫలమవుతున్నారు సిరాజ్.

దుమ్ములేపిన అయ్యర్, రాహుల్ 

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 410 పరుగులు చేసింది. జట్టులో టాప్-5 బ్యాట్స్‌మెన్ 50 పరుగుల మార్కును దాటినప్పటికీ, నాలుగో స్థానంలో వచ్చిన  శ్రేయాస్ అయ్యర్, ఐదో స్థానంలో మైదానం లో కాలుపెట్టిన కేఎల్ రాహుల్ సెంచరీలు సాధించారు. అజేయమైన ఇన్నింగ్స్ ఆడుతూ..పరుగుల వరద పారించారు. శ్రేయాస్ అయ్యర్ 94 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్లతో 128* పరుగులు చేశాడు. కాగా, కేఎల్ రాహుల్ 64 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్తో 102 పరుగులు చేశాడు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 208 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రపంచకప్‌లో నాలుగో వికెట్‌కు అతిపెద్ద భాగస్వామ్యం చేసిన జోడిగా కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యార్ నిలిచారు.

Follow Us:
Download App:
  • android
  • ios