పసికూన పంబ రేపింది.. మెస్సీని ముంచేసింది..!

Messi fail.. Iceland hold Argentina to 1-1 draw
Highlights

ఐస్‌లాండ్‌తో అర్జెంటీనా మ్యాచ్ డ్రా

హైదరాబాద్: ఫుట్‌బాల్ గండరగండడు మెస్సీ ఉన్నాడు.. వరల్డ్ కప్‌లో సెర్జియో అగ్యూరో ఫస్ట్ గోల్ చేశాడు. అయినా కానీ ఇవేవీ కూడా శనివారం స్పార్టాక్ స్టేడియంలో ఐస్‌లాండ్‌పై ఆడిన మ్యాచ్‌లో అర్జెంటీనాకు విజయాన్ని అందించలేకపోయాయి. 1-1 స్కోర్‌తో మ్యాచ్ డ్రాగా ముగిసింది. వివరాల్లోకి వెళితే.. పెనాల్టీ కిక్‌తో సెర్జియో ఒక గోల్, 23వ నిముషంలో ఐస్‌లాండ్ ప్లేయర్ ఆల్‌ఫ్రెడ్ ఫిన్బోగ్సన్ ఒక గోల్ చేయడంతో ఫస్టాఫ్ ముగిసే సమయానికి స్కోర్ 1-1గా నమోదైంది. 


సెకండాఫ్‌కు వచ్చేసరికి మెస్సీ వైఫల్యం, అర్జెంటీనాను ఎదుర్కొవడంతో ఐస్‌లాండ్ ఆధిక్యం ఆద్యంతం కనిపించింది. ఐస్‌లాండ్ గోల్ కీపర్ హల్డోర్స న్ తనదైన ఆట తీరుతో ప్రత్యర్థికి ఒక్క గోల్ కూడా రాకుండా చేశాడు. 63వ నిముషంలో మెస్సీ కొట్టిన పెనాల్టీ కిక్ ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. అలా ఎంతో ధీమాగా మైదానంలోకి అడుగుపెట్టిన అర్జెంటీనాకు 1-1 స్కోర్‌తో ఐస్‌లాండ్ గట్టి సమాధానమే చెప్పింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా గోల్ కీపర్ హేన్స్ హల్డోర్సన్ నిలిచాడు. 

loader