Manu Bhaker : మను భాకర్ ఒలింపిక్ విజయ రహస్యం ఇదే..
Paris Olympics - Manu Bhaker : టీమిండియా యంగ్ షూటర్ మను భాకర్ పారిస్ ఒలింపిక్స్ 2024 లో భారత్ కు తొలి మెడల్ ను అందించారు. తన విజయ రహస్యం గురించి మను మాట్లాడుతూ భగవద్గీత గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.
Paris Olympics - Manu Bhaker : టోక్యో ఒలింపిక్స్ 2020లో పిస్టల్ సమస్యతో మెడల్ గెలుచుకునే అవకాశాన్ని కోల్పోయిన భారత స్టార్ యంగ్ షూటర్ మను భాకర్.. పారిస్ ఒలింపిక్స్ 2024 లో అద్భుత ప్రదర్శనతో మెడల్ సాధించింది. పారిస్ ఒలింపిక్స్ 2024లో మను కాంస్య పతకాన్ని గెలుచుకుని షూటింగ్ తో ఒలింపిక్ మెడల్ గెలిచిన తొలి మహిళా భారత షూటర్ గా చరిత్ర సృష్టించారు. 22 ఏళ్ల ఈ భారతీయ షూటర్ ఈ విభాగంలో 13 ఏళ్ల ఒలింపిక్ మెడల్ నిరీక్షణకు తెరదించింది. పారిస్‌లో జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ షూటింగ్‌లో బ్రాంజ్ మెడల్ గెలుచుకుంది.
భారత్ చివరిసారిగా 2012 లండన్ ఒలింపిక్స్‌లో షూటింగ్‌లో మెడల్ గెలుచుకుంది. విజయ్ కుమార్, గగన్ నారంగ్ లు 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ లో వరుసగా రజతం, కాంస్యం సాధించారు. ఒలింపిక్ మెడల్ గెలిచిన తర్వాత షూటర్ మను భాకర్ తన విజయాన్ని గురించి మాట్లాడుతూ.. ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. "భారత్‌కు ఇది చాలా కాలం ముందే రావాల్సిన పతకం. నేను దీన్ని చేయడానికి ఒక మోడ్‌ని మాత్రమే. భారతదేశం ఇంకా ఎక్కువ పతకాలు సాధించాలి. ఈసారి వీలైనన్ని ఎక్కువ పతకాలు గెలుచుకోవడం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. నేను ఆఖరి షాట్ వరకు కూడా నేను పూర్తి స్థాయిలో పోరాడాను. కాంస్యంతో నా ప్రయత్నానికి ఫలితం దక్కింది" అని అన్నారు.
10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్ చివరి కొన్ని క్షణాల గురించి మను భాకర్ ను అడగ్గా.. "నిజాయితీగా చెప్పాలంటే, నేను చాలా భాగం భగవద్గీతను చదివాను, కాబట్టి నా మనసులో మెదులుతున్నది ఏమిటంటే, 'నువ్వు ఏమి చేయాలనుకుంటున్నావో అది చేయి.. ఏదైనా జరగని' అని అనుకున్నట్టు తెలిపారు. అలాగే, విధిని మీరు నియంత్రించలేరు కాబట్టి గీతలో కృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు.. "మీరు కర్మపై దృష్టి పెట్టండి, ఫలితంపై కాదు". అదే నా మదిలో మెదిలింది. అదే విధంగా ప్రయత్నం చేశాను అని మను భాకర్ చెప్పారు. తాను సాధారణంగా భగవద్గీతను పఠిస్తాననీ, ఆ పంక్తులు తన మదిలో మెదులుతుంటాయని చెప్పిన మను భాకర్.. ప్రతిఫలం ఆశించకుండా చేయాల్సిన పని చేయాలని అన్నారు.
"టోక్యోలో నేను చాలా నిరుత్సాహానికి గురయ్యాను. దాన్ని మార్చడానికి చాలానే ప్రయత్నం చేశాను. చాలా సమయం పట్టింది. గతం గతంలో ఉంది, వర్తమానంపై దృష్టి పెడదాం. నేను దీన్ని చేయడానికి నిజంగా సంతోషంగా ఉన్నానని" మను చెప్పారు. గీతాసారం కూడా ఈ విజయంలో భాగంగా ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా, మను భాకర్ 221.7 స్కోరుతో కాంస్య పతకాన్ని గెలుచుకోవడంతో పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు మొదటి మెడల్ లభించింది. టోక్యో ఒలింపిక్స్‌లో మను పిస్టల్ లో సమస్యలు రావడంతో అక్కడ మెడల్ ను విస్సయ్యారు. 2004లో సుమా షిరూర్ తర్వాత ఒలింపిక్స్ వ్యక్తిగత ఈవెంట్‌లో షూటింగ్ ఫైనల్ చేరిన 20 ఏళ్లలో తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది.
MANU BHAKER: భారత తొలి మహిళా ఒలింపియన్.. మను భాకర్ సరికొత్త రికార్డు