Asianet News TeluguAsianet News Telugu

లక్ష్మణ్ చెప్పినా నేను వినలేదు, నా కూతురికి చెప్పలేక..: గంగూలీ

షర్ట్ విప్పొద్దని వివిఎస్ లక్ష్మణ్ చెప్పినా తాను వినలేదని భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ చెప్పాడు. నాట్‌వెస్ట్‌ సిరీస్‌ విజయం తర్వాత అప్పటి కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ షర్ట్‌ విప్పి గ్యాలరీలో సందడి చేసిన విషయం తెలిసిందే.

Laxman Tried To Stop Him From Taking Off Shirt At Lord's, Recalls Ganguly

హైదరాబాద్: షర్ట్ విప్పొద్దని వివిఎస్ లక్ష్మణ్ చెప్పినా తాను వినలేదని భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ చెప్పాడు. నాట్‌వెస్ట్‌ సిరీస్‌ విజయం తర్వాత అప్పటి కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ షర్ట్‌ విప్పి గ్యాలరీలో సందడి చేసిన విషయం తెలిసిందే. దానిపై తీవ్ర దుమారం చెలరేగిన విషయం కూడా గుర్తుండే ఉంటుంది.  

 షర్ట్‌ విప్పొద్దని మాజీ క్రికెటర్‌, హైదారాబాదీ బ్యాట్స్‌మన్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ ఎంత చెప్పినా తాను వినలేదని గంగూలీ బ్రేక్‌ఫాస్ట్‌ విత్‌ చాంపియన్స్‌ షోలో చెప్పాడు. ఆ సమయంలో తన వెనక హర్భజన్‌, ఎడమ వైపు లక్ష్మణ్‌ ఉన్నారని, విజయం సాధించిన తర్వాత ఆనందంతో తాను టీషర్ట్‌ను విప్పుతుంటే న కర్ (వద్దు) అని లక్ష్మణ్ చెప్పాడని ఆయన వివరించాడు. 

అయినా తాను వినకుండా షర్ట్‌ విప్పేశానని, అప్పుడు లక్ష్మణ్‌ నేనేం చేయాలని అడిగాడని, దానికి నువ్వు కూడా షర్ట్‌ తీసేయని చెప్పానని అన్నాడు.

ఇలా షర్ట్‌ విప్పి సెలెబ్రేషన్‌ చేయాలనుకున్నది మాత్రం ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ ఆండ్రూ ఫ్లింటాఫ్‌ను చూసేనని గంగూలీ తెలిపాడు. ఓ వన్డే సిరీస్‌ డ్రా అయిన సందర్భంగా ఫ్లింటాఫ్‌ వాంఖడే స్టేడియంలో షర్ట్‌ తీసేసి సందడి చేశాడని ఆయన చెప్పాడు.  లార్డ్స్‌లో గెలిస్తే తను కూడా ఇలా చేయాలని అప్పుడే అనుకున్నట్లు తెలిపాడు. 

ఆ సంఘటనపై తన కూతురు సనా.. "షర్ట్‌ విప్పడం క్రికెట్‌లో తప్పకుండా చేయాలా? నీవు ఎందుకు అలా చేశావు"  అని అడిగిందని, ప్రశ్నతో తాను చాలా ఇబ్బంది పడ్డానని వివరించాడు.  జీవితంలో కొన్నిసార్లు మన భావోద్వేగాలను అదుపులో ఉంచుకోలేమని ఆమెకు తెలిపినట్లు చెప్పాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios