245 పరుగుల భారీ స్కోరు చేసింది.

ఐపీఎల్ 2018 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ హిట్టర్లు ఆకాశమే హద్దుగా చెలరేగడంతో భారీ స్కోరు నమోదైంది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో శనివారం జరుగుతున్న మ్యాచ్‌లో ఓపెనర్ సునీల్ నరైన్ (75: 36 బంతుల్లో 9x4, 4x6), కెప్టెన్ దినేశ్ కార్తీక్ (50: 23 బంతుల్లో 5x4, 3x6) చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 245 పరుగుల భారీ స్కోరు చేసింది.