ఖో-ఖో ప్రపంచ కప్: రికీ కేజ్ ఆసక్తికర కామెంట్స్ !

Kho Kho World Cup 2025: ఖో-ఖో ప్రపంచ కప్ 2025 ఢిల్లీలో అట్టహాసంగా ప్రారంభమైంది! భారత్ తో సహా 39 దేశాల జట్లు టైటిల్ కోసం పోటీ పడుతున్నాయి. రికీ కేజ్ కూడా ఈ సాంప్రదాయ క్రీడకు మద్దతు తెలిపారు.

Kho Kho World Cup 2025 Begins Ricky Kej Extends Support RMA

Kho Kho World Cup 2025: భారతదేశం ప్రస్తుతం ఆధ్యాత్మికత, సంస్కృతితో పాటు క్రీడలకు కూడా వేదికగా నిలుస్తోంది. మహా కుంభ్ 2025 ప్రారంభమైన వేళ, దేశంలోనే అత్యంత పురాతనమైన సాంప్రదాయ క్రీడ ఖో-ఖో ప్రపంచ ఛాంపియన్‌షిప్ కూడా ప్రారంభమైంది. తొలి ఖోఖో ప్రపంచ కప్ 2025 దేశరాజధాని ఢిల్లీలో ఘనంగా ప్రారంభం అయింది. ఈ క్రమంలోనే ప్రముఖ సంగీతకారుడు రికీ కేజ్ ఈ సాంప్రదాయ క్రీడకు ప్రోత్సాహం అందించాలనీ, ప్రపంచ స్థాయిలో సంరక్షించాలని విజ్ఞప్తి చేశారు. ఖో-ఖో ప్రపంచ కప్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

గ్రామీ అవార్డు గ్రహీత, అంతర్జాతీయ స్థాయిలో భారతీయ సంగీతాన్ని ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషించిన రికీ కేజ్, ఢిల్లీలో జరుగుతున్న ఖో-ఖో ప్రపంచ కప్ గురించి మాట్లాడుతూ.. ఇది నిస్సందేహంగా భారతదేశపు సాంప్రదాయ క్రీడ, కానీ కొత్త, ఆధునిక, ఉత్కంఠభరితమైన అవతారంలో ప్రపంచంలోని వివిధ దేశాల నుండి జట్లు ఈసారి పోటీ పడుతున్నాయి. కాబట్టి ఖో-ఖో ప్రపంచ కప్ చూసి ఆనందించండి.. ఆటగాళ్లను ప్రోత్సహించండి అని పేర్కొన్నారు.

 

 

ఖో-ఖో ప్రపంచ కప్ ఎప్పుడు ప్రారంభమైంది?

భారతదేశంలో ఖో-ఖో ప్రపంచ కప్ జనవరి 13 నుండి 19 వరకు జరుగుతోంది. న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ స్టేడియంలో జరుగుతున్న ఈ ప్రపంచ కప్‌లో భారత్‌తో సహా 39 దేశాల జట్లు పాల్గొంటున్నాయి. పురుషులు, మహిళల విభాగాల్లో ఏకకాలంలో జరుగుతోంది.

Kho Kho World Cup 2025 Begins Ricky Kej Extends Support RMA

పురుషుల టోర్నమెంట్‌లో నాలుగు గ్రూపులు ఉన్నాయి - A, B, C, D. ప్రతి గ్రూపులో నాలుగు జట్లు ఉన్నాయి. ప్రతి గ్రూపు నుండి టాప్ 2 జట్లు క్వార్టర్ ఫైనల్ నుండి ప్రారంభమయ్యే నాకౌట్ దశకు అర్హత సాధిస్తాయి. భారత్ తన తొలి మ్యాచ్‌లో నేపాల్‌తో తలపడుతుంది.

గ్రూప్ A: భారత్, నేపాల్, పెరూ, బ్రెజిల్, భూటాన్

గ్రూప్ B: దక్షిణాఫ్రికా, ఘనా, అర్జెంటీనా, నెదర్లాండ్స్, ఇరాన్

గ్రూప్ C: బంగ్లాదేశ్, శ్రీలంక, దక్షిణ కొరియా, USA, పోలాండ్

గ్రూప్ D: ఇంగ్లాండ్, జర్మనీ, మలేషియా, ఆస్ట్రేలియా, కెన్యా

Kho Kho World Cup 2025 Begins Ricky Kej Extends Support RMA

మహిళల టోర్నమెంట్‌లో కూడా నాలుగు గ్రూపులు ఉన్నాయి. అయితే, గ్రూప్ Dలో ఐదు జట్లు ఉన్నాయి. నాలుగు గ్రూపుల నుండి టాప్ 2 జట్లు క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్, ఫైనల్‌తో సహా టోర్నమెంట్ యొక్క నాకౌట్ దశలో ఆడతాయి. తొలి మ్యాచ్ జనవరి 13న ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతుంది. భారత్ తన తొలి ఖో-ఖో ప్రపంచ కప్ టైటిల్ కోసం తన ప్రయాణాన్ని దక్షిణ కొరియాతో మ్యాచ్‌తో ప్రారంభిస్తుంది.

గ్రూప్ A: భారత్, ఇరాన్, మలేషియా, దక్షిణ కొరియా

గ్రూప్ B: ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, కెన్యా, ఉగాండా, నెదర్లాండ్స్

గ్రూప్ C: నేపాల్, భూటాన్, శ్రీలంక, జర్మనీ, బంగ్లాదేశ్

గ్రూప్ D: దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, పోలాండ్, పెరూ, ఇండోనేషియా

టోర్నమెంట్ గ్రూప్ దశ జనవరి 16న ముగుస్తుంది, నాకౌట్ దశ జనవరి 17న ప్రారంభమవుతుంది. పురుషులు, మహిళల జట్ల ఫైనల్ మ్యాచ్ జనవరి 19, ఆదివారం జరుగుతుంది.

Kho Kho World Cup 2025 Begins Ricky Kej Extends Support RMA

ప్రత్యక్ష ప్రసార వివరాలు

ఖో-ఖో ప్రపంచ కప్ 2025 మ్యాచ్‌లు ఉదయం 10:30 గంటలకు ప్రారంభమై రాత్రి 9:30 గంటల వరకు కొనసాగుతాయి. ఖో-ఖో ప్రపంచ కప్ 2025 ప్రత్యక్ష ప్రసారం అధికారిక ప్రసారకర్త అయిన స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యేకంగా ప్రసారం చేయబడుతుంది.  అలాగే, OTTలో ఈవెంట్‌ను చూడాలనుకునే వారు డిస్నీ+ హాట్‌స్టార్‌లో యాప్, వెబ్ సైట్ లో చూడవచ్చు.

ఇవి కూడా చదవండి:

ఖో ఖో ప్రపంచ కప్ 2025: దేశాన్ని గర్వపడేలా చేస్తాం.. టీమిండియా కోచ్ అశ్విని శర్మ ప్రత్యేక ఇంటర్వ్యూ 

ఖో ఖో ప్రపంచ కప్ 2025: మేము సిద్ధంగా ఉన్నాం.. భారత కెప్టెన్

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios