24 ఏళ్ల రిటైర్మెంట్ తర్వాత.. తిరిగి జాతీయజట్టులోకి కపిల్‌దేవ్

kapil dev represent indian national team again
Highlights

భారత్‌లో క్రికెట్ ఒక మతంలా మారడానికి కీలకపాత్ర పోషించిన వ్యక్తుల్లో ముందువరుసలో ఉంటాడు కపిల్‌దేవ్. 1983లో కపిల్ సారథ్యంలోని టీమిండియా విశ్వవిజేతగా నిలిచింది.

భారత్‌లో క్రికెట్ ఒక మతంలా మారడానికి కీలకపాత్ర పోషించిన వ్యక్తుల్లో ముందువరుసలో ఉంటాడు కపిల్‌దేవ్. 1983లో కపిల్ సారథ్యంలోని టీమిండియా విశ్వవిజేతగా నిలిచింది. ఆ దెబ్బతో దేశంలో క్రికెట్‌కు ఎక్కడా లేని క్రేజ్ వచ్చింది. కొన్నాళ్ల తర్వాత కపిల్‌దేవ్ ఇంటర్నేషనల్ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పాడు. ఈ హర్యానా హారికేన్‌కు క్రికెట్‌తో పాటు గోల్ఫ్‌లోనూ మంచి ప్రావీణ్యం ఉంది.. క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన తర్వాత తన ఫోకస్ గోల్ఫ్‌పై పెట్టిన కపిల్ బాగా రాటుదేలాడు.

అలా 2015లో చైనాలో నిర్వహించిన గోల్ఫ్ టోర్నమెంట్‌లో.. జూలైలో నోయిడాలో జరిగిన ఆల్ ఇండియా సీనియర్ టోర్నమెంట్‌లో అర్హత సాధించి... 2018 ఆసియా పసిఫిక్ సీనియర్ గోల్ఫ్ టోర్నమెంట్ కోసం ప్రకటించిన ముగ్గురు సభ్యుల భారత జట్టులో కపిల్ చోటు దక్కించుకున్నాడు. జపాన్‌లోని మియాజాకిలో అక్టోబర్ 17 నుంచి ఈ మెగా టోర్నీ జరగబోతోంది. అలా సరదాగా ఆడటం మొదలుపెట్టి గోల్ఫ్‌లో ప్రొఫెషనల్‌ గోల్ఫ్ ‌ప్లేయర్‌గా ఎదిగాడు.. అలా 59 ఏళ్ల వయసులో తిరిగి భారతదేశానికి ప్రాతినిథ్యం వహించబోతున్నాడు.
 

loader