జపాన్, సెనెగల్ సై అంటే సై.. మ్యాచ్ డ్రా

Japan controls Senegal to draw
Highlights

జపాన్, సెనెగల్ సై అంటే సై.. మ్యాచ్ డ్రా

హైదరాబాద్: ఎంతో బలమైన సెనెగల్ టీమ్‌ను జపాన్ జట్టు కంట్రోల్ చేసిన వైనం చూస్తే సగటు ఫుట్‌బాల్ ప్రేక్షకుడికి జపాన్ మీద ఎక్కడలేని అభిమానం పుట్టుకొస్తుంది. గెలిస్తే బాగుండు అనిపిస్తుంది. ఆద్యంత ఉత్కంఠభరితంగా సాగిన గ్రూప్ హెచ్ మ్యాచ్‌లో ఇరు జట్లు 2-2 గోల్స్‌తో డ్రా చేశాయి. ఆరంభం నుంచి అదరహో అన్నట్టుగా ఇరు జట్లు నువ్వా నేనా అన్నట్టుగా ఆట ఆడాయి. 


11వ నిముషంలో సెనెగల్‌కు చెందిన షాడియో మనే గోల్ చేశాడు. దీంతో సెనెగల్‌కు ఆధిక్యం లభించింది. అయితే ఆ సంబరం ఎంతో సేపు నిలువలేదు. 34వ నిముషంలో జపాన్ ప్లేయర్ తకాషి ఇనూయి గోల్ చేసి స్కోరును 1-1తో సమం చేశాడు. ఫస్టాఫ్ ముగిసేసరికి ఇరు జట్లు 1-1తో ఈక్వల్‌గా నిలిచాయి. 
సెకండాఫ్‌లోనూ మ్యాచ్ హోరా హోరీగా సాగింది. 71వ నిముషంలో సెనెగల్‌కు చెందిన మౌసా వాఘే గోల్ చేసి సెనెగల్‌కు 2-1 ఆధిక్యం తెచ్చి పెట్టాడు. కానీ సరిగ్గా ఏడంటే ఏడు నిముషాల్లోనే జపాన్ ప్లేయర్ కైసుకే హోండా చేసి 2-2తో ఇరు జట్ల స్కోరును సమం చేశాడు. ఆ తర్వాత ఎంత ట్రయ్ చేసినా ఏ ఒక్కరూ గోల్ చేయలేకపోయారు. చివరికి 2-2తో మ్యాచ్ ముగిసింది.

loader