ఐపీఎల్ జట్ల అందాల యజమానుల్లో కావ్యా మారన్ ఒకరు. మైదానంలో తను చేసే హడావుడి, జట్టు క్రికెటర్లతో సాన్నిహిత్యం ఆమెను ప్రత్యేకంగా నిలపుతుంటాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున తొలిసారి బరిలోకి దిగిన ఇషాన్ కిషన్ సెంచరీతో చెలరేగిపోయాడు. కావ్యా మారన్ కి ఫ్లయింగ్ కిస్ విసిరాడు.
IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్‌లో ఇషాన్ కిషన్ అదిరిపోయే స్టార్టింగ్ ఇచ్చాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతూ ఫస్ట్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై దుమ్మురేపే సెంచరీ కొట్టాడు. దీంతో ఐపీఎల్‌లో తన ఫస్ట్ సెంచరీని ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటివరకు ఢిల్లీ, ముంబై ఇండియన్స్ తరఫున 105 మ్యాచ్‌లు ఆడినా ఒక్క సెంచరీ కూడా చేయలేదు. కానీ సన్‌రైజర్స్ టీమ్‌లోకి రాగానే ఫస్ట్ ఇన్నింగ్స్‌లోనే అదరగొట్టాడు. 45 బంతుల్లో సెంచరీ బాదిన ఇషాన్ సెలెబ్రేషన్ అందరి దృష్టిని ఆకర్షించింది. అతను అలా చేయగానే ఫ్లయింగ్ కిస్ ఇచ్చి సోషల్ మీడియాలో రచ్చ లేపాడు.
సెంచరీ కొట్టిన తర్వాత ఇషాన్ కిషన్ ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు
ఇషాన్ కిషన్ ఐపీఎల్ 2025లో రెండో మ్యాచ్‌లో ఆర్ఆర్ మీద 47 బంతుల్లో 102 రన్స్ చేసి దుమ్ములేపాడు. అతను 45 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సెంచరీ కొట్టగానే గ్రౌండ్‌లో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ వైపు చూస్తూ ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. కావ్య కూడా అతని ఆటను మెచ్చుకుంటూ నిలబడి చప్పట్లు కొట్టింది. ఆమె రియాక్షన్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. దానిపై ఓ లుక్కేద్దాం.
ఇషాన్ సెంచరీతో SRHకు భారీ విక్టరీ
ఇషాన్ సెంచరీతో ఎస్ఆర్‌హెచ్ ఫస్ట్ మ్యాచ్‌లో ఆర్ఆర్ మీద 44 రన్స్ తేడాతో గెలిచింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ బ్యాట్స్‌మెన్ దుమ్మురేపారు. 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 286 రన్స్ చేశారు. ఇషాన్ సెంచరీతో పాటు ట్రావిస్ హెడ్ కూడా 31 బంతుల్లో 67 రన్స్ చేశాడు. భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 242 రన్స్ మాత్రమే చేయగలిగింది. సంజు శాంసన్, ధ్రువ్ జురెల్ కాస్త ట్రై చేసినా స్కోర్ చాలా ఎక్కువ కావడంతో టార్గెట్ ఛేదించలేకపోయారు.
