రెండు క్యాచ్ లు వదిలేసి విలన్, కోహ్లీని ఔట్ చేసి జడేజా హీరో: నో సెలబ్రేషన్

IPL 2018: Ravindra Jadeja turns CSK's hero
Highlights

ఈ ఐపిల్ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్న రవీంద్ర జడేజా పెద్దగా రాణించడం లేదు.

పూణే: ఈ ఐపిల్ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్న రవీంద్ర జడేజా పెద్దగా రాణించడం లేదు. అయితే, శనివారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచులో విరాట్ కోహ్లీ వికెట్ తీసి చెన్నై సూపర్ కింగ్స్ ఆరు వికెట్ల తేడాతో సాధించిన విజయంలో హీరో పాత్రనే పోషించాడు.

కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచులో జడేజా వరుసగా రెండు క్యాచులు వదిలేశాడు. ఆ కారణంగా మొదట్లోనే ఔట్ కావాల్సిన సునీల్ నరైన్ విలువైన 32 పరుగులు సాధించాడు. శనివారంనాడు రాయల్ చాలెంచర్స్ బెంగళూర్ కెప్టెన్ విరాట్ కోహ్లీని క్లీన్ బౌల్డ్ చేశాడు. అయితే, సెలబ్రేట్ చేసుకోకూడదని జడేజా నిర్ణయించుకున్ాడు. 

కోహ్లీ జడేజా వైపు ఓ వింతగా ఆశ్చర్యంతో చూశాడు. సాధారణంగా వికెట్ తీసిన జడేజా తనదైన శైలిలో సెలబ్రేట్ చేసుకునేవాడు. కానీ, కోహ్లీ చూపునకు అతను ఏ మాత్రం ప్రతిస్పందించలేదు. దానిపై నెటిజన్లు తమదైన రీతిలో జడేజాపై వ్యాఖ్యలు చేశారు. 

అది తన తొలి బంతి అని, తాను సెలబ్రేట్ చేసుకోవడానికి సిద్ధంగా లేనని, విరాట్ వికెట్ చాలా పెద్దదే అని, మంచి వికెట్ తీశానని తాను అనుకున్నానని జడేజా అన్నాడు. 

loader