MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • IND vs ENG : సెమీస్‌లో భారత్‌కు అసలైన ముప్పు.. ఎవడ్రా వీడు ఇలా ఉన్నాడు !

IND vs ENG : సెమీస్‌లో భారత్‌కు అసలైన ముప్పు.. ఎవడ్రా వీడు ఇలా ఉన్నాడు !

IND vs ENG : సెమీ ఫైనల్స్ వేళ ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ విల్ జాక్స్ ఫామ్ భారత్‌కు ఆందోళన కలిగిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణిస్తున్న అతడిని అడ్డుకోవడం సూర్యకుమార్ యాదవ్ సేనకు సవాలుగా మారింది. ఎందుకో ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Mar 05 2026, 05:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఇంగ్లాండ్ జట్టులో బాంబులా మారిన విల్ జాక్స్.. సూర్య ప్లాన్ రివర్స్ అయితే కష్టమే!
Image Credit : X/ICC

ఇంగ్లాండ్ జట్టులో బాంబులా మారిన విల్ జాక్స్.. సూర్య ప్లాన్ రివర్స్ అయితే కష్టమే!

టీ200 ప్రపంచకప్ క్లైమాక్స్ దశకు చేరుకుంది. సెమీ ఫైనల్‌లో ఇంగ్లాండ్ తో తలపడనున్న భారత్‌కు ఇప్పుడు ఒకే ఒక ఆటగాడు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడు. అతడే ఇంగ్లాండ్ నయా సంచలనం విల్ జాక్స్. ఈ టోర్నీలో ఇప్పటికే నాలుగు సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్న జాక్స్, భారత్ టైటిల్ కలలకు ప్రధాన అడ్డంకిగా మారే అవకాశం ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
బ్యాటింగ్‌లో విధ్వంసం.. బౌలింగ్‌లో మాయాజాలం
Image Credit : Getty

బ్యాటింగ్‌లో విధ్వంసం.. బౌలింగ్‌లో మాయాజాలం

విల్ జాక్స్ కేవలం ఒక సాధారణ బ్యాటర్ మాత్రమే కాదు, మ్యాచ్ గమనాన్ని మార్చగలిగే ఆల్ రౌండ్ మాన్స్టర్. ఈ ప్రపంచకప్‌లో 176.85 స్ట్రైక్ రేట్‌తో పరుగులు సాధిస్తూ ప్రత్యర్థి బౌలర్లను హడలెత్తిస్తున్నాడు. ముఖ్యంగా లోయర్ ఆర్డర్‌లో వచ్చి భారీ సిక్సర్లతో విరుచుకుపడటం అతడి ప్రత్యేకత. మరోవైపు తన ఆఫ్ స్పిన్‌తో ఇప్పటికే ఏడు వికెట్లు పడగొట్టి, కీలక సమయాల్లో వికెట్లు తీసే బౌలర్‌గా ఎదిగాడు. భారత టాప్ ఆర్డర్‌ను దెబ్బతీయడానికి ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్.. జాక్స్ బౌలింగ్‌ను అస్త్రంగా వాడుకునే అవకాశం ఉంది.

36
ఐపీఎల్ అనుభవమే టీమిండియాకు చేటు?
Image Credit : ANI

ఐపీఎల్ అనుభవమే టీమిండియాకు చేటు?

విల్ జాక్స్ భారత్‌కు ఇంత ప్రమాదకరంగా మారడానికి ప్రధాన కారణం అతడికి ఉన్న ఐపీఎల్ అనుభవం. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), ముంబై ఇండియన్స్ జట్ల తరపున ఆడిన జాక్స్‌కు భారత బౌలర్ల బలహీనతలు, ఇక్కడి పిచ్‌ల స్వభావంపై పూర్తి అవగాహన ఉంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్ల ఆటతీరును దగ్గరుండి గమనించిన జాక్స్, సెమీస్‌లో ఆ అనుభవాన్ని ఉపయోగించి భారత్‌ను దెబ్బకొట్టే ప్రమాదం ఉంది.

46
ఎమినెమ్ లుక్.. విల్ జాక్స్ మాన్స్టర్ ప్రదర్శన
Image Credit : our own

ఎమినెమ్ లుక్.. విల్ జాక్స్ మాన్స్టర్ ప్రదర్శన

ఆస్ట్రేలియా పర్యటన తర్వాత తన లుక్‌ను పూర్తిగా మార్చుకున్న జాక్స్, అమెరికన్ రాపర్ ఎమినెమ్ (స్లిమ్ షేడీ)ను తలపిస్తున్నాడు. సహచరులు అతడిని సరదాగా ఆటపట్టిస్తున్నా, మైదానంలో మాత్రం అతను అత్యంత ప్రమాదకరంగా కనిపిస్తున్నాడు. "నేను ఒక మాన్స్టర్‌ను సృష్టించాను" అనే ఎమినెమ్ పాట జాక్స్‌కు అతికినట్లు సరిపోతుంది. సర్రే కోచ్ గారెత్ బాటీ చెప్పినట్లుగా, జాక్స్ ఇప్పుడు కేవలం టాలెంట్ ఉన్న ప్లేయర్ కాదు, ఫలితాలను ఇచ్చే పర్ఫార్మర్ గా మారిపోయాడు.

56
స్పిన్ ఉచ్చులో భారత బ్యాటర్లు?
Image Credit : Getty

స్పిన్ ఉచ్చులో భారత బ్యాటర్లు?

భారత బ్యాటర్లు సాధారణంగా స్పిన్‌ను బాగా ఆడతారని పేరున్నా, విల్ జాక్స్ వేసే ఆఫ్ స్పిన్ కొంత భిన్నంగా ఉంటుంది. మొయిన్ అలీని తలపిస్తున్న అతడి బౌలింగ్ శైలి, వాంఖడే వంటి పిచ్‌లపై అదనపు టర్న్ సాధిస్తోంది. నెట్స్‌లో గంటల తరబడి చెమటోడుస్తున్న జాక్స్, భారత మిడిల్ ఆర్డర్‌ను టార్గెట్ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా వంటి హిట్టర్లను కట్టడి చేయడంలో జాక్స్ కీలక పాత్ర పోషించగలడు.

66
సూర్యకుమార్ యాదవ్ సేన సిద్ధమేనా?
Image Credit : Getty

సూర్యకుమార్ యాదవ్ సేన సిద్ధమేనా?

ప్రస్తుత ఫామ్ చూస్తుంటే విల్ జాక్స్‌ను త్వరగా అవుట్ చేయకపోతే భారత్‌కు భారీ మూల్యం తప్పదు. ఇంగ్లాండ్ జట్టులో జోస్ బట్లర్ వంటి దిగ్గజాలు ఉన్నప్పటికీ, ఈ టోర్నీలో ఇంగ్లండ్‌ను ఒంటిచేత్తో నడిపిస్తోంది మాత్రం జాక్సే. సెమీ ఫైనల్ వంటి హై ప్రెజర్ మ్యాచ్‌లో జాక్స్ తన అల్టర్ ఈగోను బయటకు తీస్తే భారత బౌలర్లకు చుక్కలు కనిపించడం ఖాయం. మరి ఈ ఇంగ్లాండ్ మాన్స్టర్ ను అడ్డుకోవడానికి గౌతమ్ గంభీర్, సూర్యకుమార్ యాదవ్ ఎలాంటి వ్యూహాలు సిద్ధం చేశారో చూడాలి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఐసీసీ టీ20 ప్రపంచ కప్
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
క్రీడలు
క్రికెట్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
virat kohli: ఆ ఆశ్ర‌మానికి వెళ్లినందుకు కోహ్లికి రూ. 5 కోట్లు ఇచ్చారా.? అస‌లేం జ‌రిగిందంటే
Recommended image2
Team India New Captain: టీమిండియాకు కొత్త కెప్టెన్, వైస్ కెప్టెన్లు.. పూర్తి వివరాలు ఇవే
Recommended image3
స్మృతి మంధాన చేతికి టీమిండియా పగ్గాలు.. హర్మన్‌ప్రీత్ స్థానంలో కొత్త కెప్టెన్
Related Stories
Recommended image1
IND vs ENG : భారత్ vs ఇంగ్లాండ్ బిగ్ ఫైట్.. టాస్ గెలిస్తే ట్రోఫీ గెలిచినట్టేనా? అసలు కథ ఇదే
Recommended image2
IND vs ENG : ఇంగ్లాండ్‌తో సెమీఫైనల్ యుద్ధం.. భారత్ కు తలనొప్పిగా నలుగురు ప్లేయర్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved