Asianet News TeluguAsianet News Telugu

విజిలేయకుంటే.. ఆట అధ్వాన్నమైపోదూ..?

విజిలేయకుంటే.. ఆట అధ్వాన్నమైపోదూ..?

Interesting Referees with firm hand on whistle

విజిలేయకుంటే.. ఆట అధ్వాన్నమైపోదూ..?
హైదరాబాద్: ఓ చేతిలో విజిల్.. జేబులో కలర్ కార్డులు.. ప్లేయర్ల పాటు గ్రౌండంతా పరిగెడుతూనే ఉంటారు. రిఫరీలని పిలిచే వీళ్ళే కనుక లేకుంటే ఆట అధ్వాన్నమైపోదూ..! ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ఇంతటి కీలకమైన రిఫరీలకు ఇదే లైఫ్ లాంగ్ ప్రొఫెషన్ అనుకుంటే పొరపాటుపడినట్టే. వాళ్ళలో పార్ట్ టైమ్ యాక్టర్లుంటారు.. సూపర్ మార్కెట్ ఓనర్లు ఉంటారు.. ఇంకా చెప్పాలంటే లెక్కల మాస్టార్లూ ఉంటారు. ఇలా బ్యాక్ గ్రౌండ్‌లు వేరైనా వారంతా చేసే పని ఒక్కటే.. గేమ్‌ను గేమ్‌తో పాటు ప్లేయర్స్‌ను కంట్రోల్లో ఉంచడం. రష్యా ఫుట్‌బాల్ వరల్డ్ కప్ మ్యాచ్‌లలో కనిపించే 35 మంది రిఫరీల్లో ఇంట్రెస్టింగ్‌గా అనిపించే కొందరి గురించి తెలుసుకుందాం.

రివ్‌షాన్ ఇర్మటోవ్
40 ఏళ్ళ ఈ ఉజ్బెకిస్థాన్ దేశస్థుడు అనేక వరల్డ్ కప్ మ్యాచ్‌లకు సేవలందించాడు. మొదట్లో ఇతడూ ఫుట్‌బాల్ ప్లేయరే. ఒకానొక గాయం అతడి కెరీర్‌కు ది ఎండ్ చెప్పింది. రివ్‌షాన్ రిఫరీ ఎలా అయ్యాడంటే.. వాళ్ళ నాన్నగారు ఒక యూత్ టీమ్‌కు ఇన్‌చార్జ్‌గా పనిచేస్తుంటే మనవాడు ఆయనకు చేదోడు వాదోడుగా ఉండేవాడు. ఒకసారి గేమ్ మొదలవుతుందనగా రావాల్సిన రిఫరీ ఎంతకీ రాలేదు. దాంతో నాన్నగారు అందించిన విజిల్ పుచ్చుకొని డ్యూటీలోకి దిగిపోయాడు.

మార్క్ గిగెర్
ట్రిన్‌టోన్ స్టేట్ కాలేజ్‌లో టీచింగ్‌లో డిగ్రీ పుచ్చుకున్న మార్క్.. న్యూజెర్సీలో లెక్కల మాస్టారు అయ్యాడు. అంతకు ముందు హైస్కూల్లో చదివేటప్పుడు 2010లో మ్యాథ్స్ అండ్ సైన్స్ టీచింగ్‌లో అద్భుతమైన ప్రతిభ చూపించిన 103 మందిలో ఒకడిగా ప్రెసిడెన్షియల్ అవార్డు అందుకున్నాడు. చివరికి ఫుట్‌బాల్ లెక్క తేలుద్దామని ఫుల్ టైమ్ రిఫరీగా లైఫ్‌లో సెటిలైపోయాడు.

నెసోర్ పిటానా
ఇతడు 'లా ఫురియా' అనే అర్జెంటీనా సినిమాలో నటించి ప్రేక్షకులను కట్టిపడేశాడు. చూడ్డానికి 'సుల్తాన్' సినిమాలో సల్మాన్ ఖాన్‌లా ఉంటాడు. 
అంతేకాదు ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో ట్రయినర్. జిమ్నాస్టిక్స్‌లో పాఠాలు చెబుతుంటాడు.

జోర్న్ కుపెర్స్
తండ్రి రిఫరీగా పని చేస్తున్నప్పుడు, ఆయనతో పాటు తరచుగా సైడ్ లైన్స్‌లో కనిపిస్తుండేవాడు. గేమ్ మీద ఇంట్రెస్ట్ పోయాక, తండ్రి రూట్ ఫాలో అయ్యాడు. జోర్న్‌కు ఇదే లైఫ్ కాదు. ర్యాడ్‌బౌడ్ యూనివర్శిటీ, నిజ్‌మెగెన్‌లో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చదవడం కోసం ఎన్‌రోల్ చేసుకున్నాడు. అంతేకాదు అనేక సూపర్ మార్కెట్లకు ఓనర్లలో ఒకడిగా ఉన్నాడు. అక్కడితో ఆగక సొంత పట్టణంలో ఒక హెయిర్ స్టూడియో కూడా నడుపుతున్నాడు. 

ఆంటోనియో మాటువా లాహోజ్
డిజైనర్ షేడ్స్‌తో మెరిసిపోతూ రాక్ స్టార్‌లో కనిపిస్తూ స్టేడియంలో ఫ్యాన్స్‌కు సరికొత్త జోష్ తీసుకురావడం ఆంటోనియోకు మాత్రమే సొంతం. ప్లేయర్స్‌తో ఇట్టే కలిసిపోతుంటాడు. వాళ్ళతో జోక్స్ షేర్ చేసుకుంటూ నవ్వుతూ కనిపిస్తుంటాడు. తనదైన చేతి సైగలతో ప్రేక్షకులను కట్టిపడేయంలో ముందుంటాడు. టివీ ప్రోగ్రామ్స్‌లో రెగ్యులర్‌గా కనిపించడానికి ఇష్టపడుతుంటాడు. ఫస్ట్ టైమ్ వరల్డ్ కప్ రిఫరీగా రష్యాలో ఆరంగేట్రం చేయబోతున్నాడు.

Follow Us:
Download App:
  • android
  • ios