సారాంశం
Indian Hockey: పారిస్ ఒలింపిక్స్ 2024 లో భారత హాకీ జట్టు అద్భుత ప్రదర్శనతో స్పెయిన్ ను చిత్తుగా ఓడించి బ్రాంజ్ మెడల్ గెలుచుకుంది. 52 ఏళ్ల తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఒలింపిక్ పతకాలు సాధించడంతో ప్రధాన మోడీ భారత హాకీ జట్టుపై ప్రశంసలు కురిపించారు.
Indian Hockey: పారిస్ ఒలింపిక్స్ 2024 లో అద్భుత ప్రదర్శనతో భారత హాకీ జట్టు కాంస్యం సాధించింది. బ్రాంజ్ మెడల్ కోసం జరిగిన పోరులో భారత్-స్పెయిన్ లు తలపడ్డాయి. చివరివరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో భారత్ 2-1తో స్పెయిన్ ను ఓడించి మెడల్ గెలుచుకుంది. 52 ఏళ్ల తర్వాత వరుసగా బ్యాక్ టు బ్యాచ్ మెడల్స్ సాధించింది. ఈ మెడల్ తో భారత్ ఖాతాలో నాలుగు పతకాలు వచ్చి చేరాయి. ఇవన్ని కూడా కాంస్య పతకాలే కావడం గమనార్హం. ఈ క్రమంలోనే భారత హాకీ జట్టుకు ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. ఈ విక్టరీని రాబోయే తరాలు గుర్తుంచుకుంటాయని పేర్కొన్నారు. ఈ మెడల్ దేశంలోని యువతకు స్ఫూర్తినిస్తుందనీ, హాకీ మరింత ప్రాచుర్యం పొందుతుందన్నారు. పారిస్ ఒలింపిక్ మెడల్ సాధించిన భారత జట్టు సభ్యులతో ప్రధాని మోడీ ఫోన్‌లో మాట్లాడి అభినందించారు.
హాకీలో భారత్ కాంస్యం గెలుపొందిన సందర్భంగా ప్రధాని మోడీ తన X హ్యాండిల్‌లో టీమిండియాకు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు.. "ఇది భవిష్యత్ తరాలు గుర్తుంచుకునే విజయం. ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు అద్భుత ప్రదర్శన చేసి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది! ఒలింపిక్స్‌లో వరుసగా రెండో పతకం కావడం మరింత ప్రత్యేకం. వారి విజయం నైపుణ్యం, పట్టుదల, జట్టు స్ఫూర్తి విజయమిది. గొప్ప ధైర్యాన్ని, దృఢత్వాన్ని ప్రదర్శించారు. క్రీడాకారులకు అభినందనలు. ప్రతి భారతీయుడు హాకీతో భావోద్వేగ సంబంధాన్ని కలిగి ఉంటాడు.. ఈ విజయం మన దేశ యువతలో హాకీ ఆటను మరింత ప్రాచుర్యం పొందేలా చేస్తుంది" అని పేర్కొన్నారు.
52 ఏళ్ల తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఒలింపిక్ మెడల్స్ గెలిచిన భారత హాకీ జట్టు