MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Sports
  • Cricket
  • Abhigyan Kundu : వామ్మో ఏంటి కొట్టుడు.. IPL వేలానికి ముందు ఆసియా కప్‌లో డబుల్ సెంచరీ బాదిన తొలి భారత క్రికెటర్ !

Abhigyan Kundu : వామ్మో ఏంటి కొట్టుడు.. IPL వేలానికి ముందు ఆసియా కప్‌లో డబుల్ సెంచరీ బాదిన తొలి భారత క్రికెటర్ !

Abhigyan Kundu : ఆసియా కప్ 2025లో భారత అండర్-19 స్టార్ అభిజ్ఞాన్ కుందు మలేషియాపై డబుల్ సెంచరీతో చరిత్ర సృష్టించాడు. 125 బంతుల్లో 209 పరుగులు చేసి, అంబటి రాయుడు రికార్డును బద్దలు కొట్టాడు.

3 Min read
Author : Mahesh Rajamoni
| Updated : Dec 16 2025, 04:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
డబుల్ సెంచరీతో అంబటి రాయుడు రికార్డ్ బద్దలు కొట్టిన అభిజ్ఞాన్ కుందు
Image Credit : ChatGPT

డబుల్ సెంచరీతో అంబటి రాయుడు రికార్డ్ బద్దలు కొట్టిన అభిజ్ఞాన్ కుందు

దుబాయ్ లో జరుగుతున్న అండర్-19 ఆసియా కప్ 2025లో భారత యువ సంచలనం అభిజ్ఞాన్ కుందు చరిత్ర సృష్టించాడు. మంగళవారం మలేషియా అండర్-19 జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఈ ముంబై వికెట్ కీపర్-బ్యాటర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 125 బంతుల్లో 209 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. యూత్ వన్డేల చరిత్రలో డబుల్ సెంచరీ సాధించిన తొలి భారతీయ బ్యాటర్‌గా రికార్డు పుస్తకాల్లోకి ఎక్కాడు.

కుందు తన అద్భుతమైన ఇన్నింగ్స్‌తో 23 ఏళ్ల నాటి అంబటి రాయుడు రికార్డును అధిగమించడమే కాకుండా, జట్టు స్కోరును 408 పరుగుల భారీ స్థాయికి చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు.

రికార్డుల మోత మోగించిన అభిజ్ఞాన్ కుందు

మలేషియా బౌలర్లపై విరుచుకుపడిన అభిజ్ఞాన్ కుందు కేవలం 121 బంతుల్లోనే తన డబుల్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఇది అండర్-19 వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీ కావడం విశేషం. ఇంతకుముందు ఈ రికార్డు దక్షిణాఫ్రికాకు చెందిన జోరిచ్ వాన్ షాల్క్‌విక్ (145 బంతులు) పేరిట ఉండేది.

కుందు తన ఇన్నింగ్స్‌లో మొత్తం 17 ఫోర్లు, 9 భారీ సిక్సర్లు బాదాడు. 125 బంతుల్లో 209 పరుగులతో అజేయంగా నిలిచిన కుందు.. 2002లో ఇంగ్లండ్‌పై అంబటి రాయుడు సాధించిన 177 పరుగుల అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డును బద్దలు కొట్టాడు. అంతేకాకుండా, ఇదే టోర్నీలో యూఏఈపై వైభవ్ సూర్యవంశీ చేసిన 171 పరుగుల రికార్డును కూడా కుందు అధిగమించాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ప్రపంచ స్థాయిలో రెండో అత్యధిక స్కోరు
Image Credit : X/@cric_sevenn

ప్రపంచ స్థాయిలో రెండో అత్యధిక స్కోరు

అండర్-19 వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన జాబితాలో అభిజ్ఞాన్ కుందు రెండో స్థానంలో నిలిచాడు. మొదటి స్థానంలో దక్షిణాఫ్రికా ఆటగాడు జోరిచ్ వాన్ షాల్క్‌విక్ ఉన్నాడు. అతను 2025 జూలైలో జింబాబ్వేపై 215 పరుగులు చేశాడు. కుందు ఇన్నింగ్స్ ఆసియా కప్ చరిత్రలోనే అత్యధిక వ్యక్తిగత స్కోరుగా నమోదైంది.

యూత్ వన్డేల్లో టాప్ స్కోరర్లు

జోరిచ్ వాన్ షాల్క్‌విక్ (దక్షిణాఫ్రికా) - 215 (జింబాబ్వేపై, 2025) అభిజ్ఞాన్ కుందు (భారత్) - 209* (మలేషియాపై, 2025) హసిత్ బోయగోడ (శ్రీలంక) - 191 (కెన్యాపై, 2018)

Related Articles

Related image1
IPL Mini Auction 2026: మినీ వేలంలో జాక్‌పాట్ కొట్టే ప్లేయ‌ర్స్ వీళ్లే... ఏకంగా రూ. 30 కోట్ల పైమాటే..
Related image2
IPL 2026 Auction: చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కెచ్.. రూ. 43 కోట్లతో ఆ ఆటగాళ్లపై కన్నేసిన సీఎస్కే !
34
భారీ భాగస్వామ్యాలు - 400 దాటిన టీమిండియా
Image Credit : X/BCCI

భారీ భాగస్వామ్యాలు - 400 దాటిన టీమిండియా

టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ ఆయుష్ మాత్రే (14) త్వరగానే పెవిలియన్ చేరాడు. అయితే మరో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ మాత్రం దూకుడుగా ఆడి కేవలం 26 బంతుల్లోనే అర్ధశతకం (50) పూర్తి చేసుకున్నాడు.

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అభిజ్ఞాన్ కుందు, వేదాంత్ త్రివేది (90)తో కలిసి ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు ఏకంగా 209 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత కనిష్క్ చౌహాన్‌తో కలిసి కుందు కేవలం 36 బంతుల్లో 87 పరుగులు జోడించాడు. దీంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 408 పరుగుల భారీ స్కోరు సాధించింది.

44
ఎవరీ అభిజ్ఞాన్ కుందు?
Image Credit : X/BCCI

ఎవరీ అభిజ్ఞాన్ కుందు?

అభిజ్ఞాన్ కుందు ఏప్రిల్ 30, 2008న జన్మించాడు. దేశవాళీ క్రికెట్‌లో ముంబై జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇతను ఎడమ చేతి వాటం బ్యాటర్, వికెట్ కీపర్. పాకిస్థాన్‌తో జరిగిన మునుపటి మ్యాచ్‌లో కుందు 22 పరుగులు చేయడంతో పాటు వికెట్ల వెనుక రెండు క్యాచ్‌లు కూడా పట్టాడు.

ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్‌లో కుందు అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. మూడు మ్యాచ్‌ల్లో 263 సగటు, 151.14 స్ట్రైక్ రేట్‌తో అతను మొత్తం 263 పరుగులు సాధించాడు. ఐపీఎల్ 2026 వేలానికి ముందు ఇలాంటి ఇన్నింగ్స్ ఆడటంతో ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది.

నా రికార్డును నేనే బద్దలు కొడతాను

మ్యాచ్ అనంతరం కుందు తన ప్రదర్శనపై స్పందిస్తూ, "నాకౌట్ దశలోనూ ఇదే ఫామ్‌ను కొనసాగించడమే నా లక్ష్యం. అంబటి రాయుడు రికార్డును బద్దలు కొట్టడం చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్తులో పెద్ద టోర్నీలలో నా రికార్డును నేనే బద్దలు కొట్టడానికి ప్రయత్నిస్తాను. వికెట్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటంతో క్రీజులో నిలదొక్కుకుంటే పరుగులు వాటంతట అవే వస్తాయని భావించాను. ఎప్పుడు గేర్లు మార్చాలో నాకు తెలుసు, అందుకే వికెట్‌పై నిలబడటంపైనే దృష్టి పెట్టాను" అని పేర్కొన్నాడు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
WTC Final రేసులో టీమిండియాకు బిగ్ షాక్.. టాప్‌లో ఆసీస్, సఫారీలు సంచలనం !
Recommended image2
Javagal Srinath: ఎవరూ గుర్తుపట్టలేదు.. సీటు కూడా ఇవ్వలేదు! బెంగళూరు మెట్రోలో ఇండియన్ పేస్ లెజెండ్ !
Recommended image3
Team India: 14 ఏళ్ల తర్వాత మళ్లీ భారత జట్టులో ద్రావిడ్ - సెహ్వాగ్ కాంబినేషన్
Related Stories
Recommended image1
IPL Mini Auction 2026: మినీ వేలంలో జాక్‌పాట్ కొట్టే ప్లేయ‌ర్స్ వీళ్లే... ఏకంగా రూ. 30 కోట్ల పైమాటే..
Recommended image2
IPL 2026 Auction: చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కెచ్.. రూ. 43 కోట్లతో ఆ ఆటగాళ్లపై కన్నేసిన సీఎస్కే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved