ఇంగ్లాండుతో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచులో ఆదిలో భారత బౌలర్లు పైచేయి సాధించినట్లు కనిపించారు. కానీ, క్రమంగా ఇంగ్లాండు బ్యాట్స్ మెన్ల రెండో ఇన్నింగ్సులో వికెట్ల వద్ద నిలదొక్కుకుంటూ పరుగులు సాధించారు. బట్లర్‌ (122 బంతుల్లో 7 ఫోర్లతో 69) అర్ధ సెంచరీ చేయగా, రూట్‌ (48), జెన్నింగ్స్‌ (36), స్టోక్స్‌ (30) ఫరవా లేదనిపించారు. 

దాంతో నాలుగో టెస్టులో మూడో రోజు శనివారం ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 91.5 ఓవర్లలో 260/8 స్కోరు చేసింది. కర్రాన్‌ (67 బంతుల్లో 5 ఫోర్లతో 37 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నాడు. భారత బౌలర్లలో షమికి మూ డు, ఇషాంత్‌కు రెండు వికెట్లు దక్కాయి.
 
బ్రేక్‌ అనంతరం తన ఓవర్‌ చివరి బంతికే బెయిర్‌స్టో వికెట్‌ను షమి పడగొట్టాడు. ఈ దశలో స్టోక్స్‌, రూట్‌ కలిసి మరో 14 ఓవర్ల వరకు భారత బౌలర్లపై ఆధిపత్యం సాధించారు. నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నారని భావిస్తున్న దశలో రూట్‌ 46వ ఓవర్‌లో మిడాన్‌ నుంచి షమి నేరుగా విసిరిన త్రోతో రనౌట్‌ అయ్యాడు.
 
చివరి సెషన్‌లో స్టోక్స్‌, బట్లర్‌ ఓపికను ప్రదర్శిస్తూ క్రీజులో నిలిచారు. కాగా, 110 బంతులపాటు సహనంతో ఆడిన స్టోక్స్‌ చివరకు అశ్విన్‌ బౌలింగ్‌లో రహానెకు స్లిప్‌లో క్యాచ్‌ ఇచ్చాడు. దీంతో ఆరో వికెట్‌కు 56 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. 


అయితే, ఈ దశలో బట్లర్‌ చెలరేగడం తో పాటు అతడికి  కర్రాన్‌ తోడుగా రావడంతో వికెట్‌ తీయడం బౌలర్లకు తలకు మించిన భారమైంది.  బట్లర్‌ 96 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. 83వ ఓవర్‌లో భారత్‌ కొత్త బంతి తీసుకున్న కొద్దిసేపటికే కీలక బట్లర్‌ వికెట్‌ కోల్పోయింది. 

ఇషాంత్‌ శర్మ వేసిన ఇన్‌స్వింగర్‌కు ఎల్బీగా వెనుదిరగడంతో ఏడో వికెట్‌కు 55 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత కర్రాన్‌ తన ఫామ్‌ను సాగించగా మూడో రోజు ఆఖరి ఓవర్‌లో రషీద్‌ వికెట్‌ను షమి తీయడంతో మూడో రోజు ఆట ముగిసింది.

ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న నిర్ణయాత్మక నాలుగో టెస్ట్ లో టీంఇండియా బౌలర్లు అదరగొడుతున్నారు. మొదటి ఇన్నింగ్స్ లో తక్కువ స్కోరుకే ఇంగ్లాండ్ ను కట్టడిచేయగా రెండో ఇన్నింగ్స్ లోనే అదే తరహాలో విజృంభిస్తున్నారు. మూడోరోజు మ్యాచ్ ప్రారంభమైన కాస్సేపటికే ఇంగ్లాండ్ రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

ఇంగ్లాండ్ మూడో వికెట్ బాగస్వామ్యానికి తెరపడింది. 33 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఇంగ్లాండ్ జట్టుకు జెన్నింగ్స్, రూట్ జోడి చక్కటి భాగస్వామ్యంతో  ఆదుకునే ప్రయత్నం చేశారు. ఆచి తూచి ఆడుతూ మరో వికెట్ పడకుండా స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. ఈ క్రమంలో 92 పరుగుల వద్ద జెన్నింగ్స్ వికెట్ ను షమీ పడగొట్టాడు. 

ఇవాళ 16 పరుగుల ఓవర్ నైట్ స్కోరు వద్ద బ్యాటింగ్ ఆరంభించిన ఇంగ్లాండ్ జట్టుకు 12వ ఓవర్లో ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ అలిస్టర్ కుక్(12) బుమ్రా బౌలింగ్ ఔటయ్యాడు. ఆ తర్వాత 15 వ ఓవర్లో మోయిన్ అలీ(9) ని ఇషాంత్ శర్మ ఓ అద్భుతమైన బంతితో బోల్తా కొట్టించాడు. ఇలా వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయి ఇంగ్లాండ్ జట్టు కష్టాల్లో పడింది. ప్రస్తుతం 18.5 ఓవర్లలో ఇంగ్లాండ్ 38 పరుగులు చేసింది. క్రీజులో కేటన్ జెన్నింగ్స్(14), జోయ్ రూట్(3) ఉన్నారు.

సంబంధిత వార్తల కోసం కింది లింక్ క్లిక్ చేయండి

నాలుగో టెస్ట్: లంచ్ సమయానికి సెంచరీ కొట్టిన టీంఇండియా

నాలుగో టెస్ట్: కోహ్లీ హాఫ్ సెంచరీ మిస్

నాలుగో టెస్ట్: సచిన్ మరో రికార్డు బద్దలుకొట్టిన విరాట్ కోహ్లీ