Asianet News TeluguAsianet News Telugu

నాలుగో టెస్ట్: సచిన్ మరో రికార్డు బద్దలుకొట్టిన విరాట్ కోహ్లీ

టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డు  సాధించాడు. ఇప్పటికే సచిన్ రికార్డులను ఒక్కోటిగా బద్దలు కొడుతూ వస్తున్న కోహ్లీ నేటి మ్యాచ్ లో మరో రికార్డులో తన పేరును చేర్చుకున్నాడు. పరుగుల దాహాన్ని తీర్చుకుంటూ సచిన్ ను వెనక్కి నెట్టిన కోహ్లీ తన రికార్డుల పరంపర కొనసాగిస్తున్నాడు.

virat kohli breaks another sachin record
Author
Southampton, First Published Aug 31, 2018, 6:48 PM IST

టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డు  సాధించాడు. ఇప్పటికే సచిన్ రికార్డులను ఒక్కోటిగా బద్దలు కొడుతూ వస్తున్న కోహ్లీ నేటి మ్యాచ్ లో మరో రికార్డులో తన పేరును చేర్చుకున్నాడు. పరుగుల దాహాన్ని తీర్చుకుంటూ సచిన్ ను వెనక్కి నెట్టిన కోహ్లీ తన రికార్డుల పరంపర కొనసాగిస్తున్నాడు.

ఇంగ్లాండ్ తో జరుగుతున్న నాలుగో టెస్ట్ రెండో రోజు ఓపెనర్ శిఖర్ దావన్ ఔటవగానే కోహ్లీ బరిలోకి దిగారు. చటేశ్వర్ పుజారాతో కలిసి ఇన్నింగ్స్ ను చక్కదిద్దుతూనే తన టెస్ట్ కెరీర్ లో 6 వేల పరుగుల మైలురాయిని అదిగమించారు. దీంతో సచిన్ ను వెనక్కి నెట్టి తక్కువ ఇన్నింగ్సుల్లో ఈ ఘనత సాధించిన టీం ఇండియా క్రికెటర్ గా నిలిచాడు.

 టెస్టుల్లో సునీల్ గవాస్కర్ 117 ఇన్నింగ్సుల్లో 6 వేల పరుగులు చేయగా అతడి తర్వాత అతి తక్కువ మ్యాచుల్లో ఈ ఘనత సాధించింది విరాట్ కోహ్లీనే. ఇతడు కేవలం 119 ఇన్నింగ్స్‌ లోనే ఆ ఘనత సాధించాడు. వీరి తర్వాత సచిన్ 120 ఇన్నింగ్స్‌లలో 6 వేల పరుగులు చేసి మూడో స్థానంలో ఉండగా, వీరేంద్ర సెహ్వాగ్ 121 మ్యాచుల్లో, రాహుల్ ద్రవిడ్ 125 మ్యాచుల్లో ఈ ఘనత సాధించారు.
 
Follow Us:
Download App:
  • android
  • ios