Asianet News TeluguAsianet News Telugu

నాలుగో టెస్ట్: కోహ్లీ హాఫ్ సెంచరీ మిస్

ఇంగ్లాండ్ వేధికగా జరుగుతున్న నాలుగో టెస్ట్ లో రెండో రోజు బ్యాటింగ్ చేపట్టిన ఇండియా 15.3 ఓవర్లలో ఒక వికెట్ నష్టపోయి 46 పరుగులు చేసింది. మరో వికెట్ చేజార్చుకోకుండా శిఖర్ ధావన్, చటేశ్వర్ పుజారా ఆచితూచి నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తున్నారు. 

india vs england fourth test updates
Author
Southampton, First Published Aug 31, 2018, 4:30 PM IST

ఇంగ్లాండ్ లో జరుగుతున్న ఐదు టెస్ట్ ల సీరీస్ లో భాగంగా గురువారం నాలుగో టెస్ట్ ఆరంభమైన విషయం తెలిసిందే. భారత బౌలర్లు  మొదటి రోజు మంచి ఆరంభాన్ని అందించారు. బౌలర్ల దాటికి ఇంగ్లాండ్ బ్యాట్ మెన్స్ విలవిల్లాడిపోయారు. దీంతో 246 పరుగులకే ఆతిథ్య జట్టు ఆలౌటయ్యింది. ఆ తర్వాత బ్యాటింగ్ ఆరంభించిన టీం ఇండియా 19 పరుగులు చేసి వికెట్లేవీ నష్టపోకుండా మొదటి రోజును ముగించారు.

 మొదటి ఇన్నింగ్స్ లో టీం ఇండియా మూడో వికెట్ బాగస్వామ్యానికి తెరపడింది. కోహ్లీ, పుజారా కలిసి చక్కటి భాగస్వామ్యంతో ఆడుతూ లంచ్ విరామానికి స్కోరును 100 పరుగులు దాటించారు. అయితే లంచ్ తర్వాత కాస్త వేగంగా ఆడే క్రమంలో కెప్టెన్ కోహ్లీ ఔటయ్యారు. 46 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కోహ్లీ ఔటయ్యారు. దీంతో 146 పరుగుల వద్ద మూడో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ప్రస్తుతం క్రీజులో పుజారా(50), రహానే(3) వున్నారు.

టీం ఇండియా ఓపెనర్లిద్దరూ రెండో రోజు తొలి ఇన్నింగ్స్ ఆరంభంలోనే పెవిలియన్ బాట పట్టారు. లోకేశ్ రాహుల్ (19 వ్యక్తిగత పరుగులు), శిఖర్ ధావన్ (23 పరుగులు) లు ఔటయ్యారు. ప్రస్తుతం ఇండియా జట్టు 21 ఓవర్లలో 67 పరుగులు చేసింది. క్రీజులు చటేశ్వర్ పుజారా, కెప్టెన్ వికాట్ కోహ్లీ వున్నారు.

అయితే రెండో రోజైన శుక్రవారం భారత్ కు మొదట్లోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ లోకేశ్ రాహుల్ 19 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. 24 బంతుల్లో 19 పరుగులు చేసి బ్రాడ్ బౌలింగ్ లో ఎల్బీగా అవుటై పెవిలియన్ బాట పట్టాడు లోకేశ్. దీంతో 37 పరుగుల వద్ద భారత్ మొదటి వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం ఓపెనర్ శిఖర్ ధావన్( 39 బంతుల్లో 20 పరుగులు), చటేశ్వర్ పుజారా( 27 బంతుల్లో 2 పరుగులు) క్రీజులో ఉన్నారు.

ప్రస్తుతం ఇండియా 15.3 ఓవర్లలో ఒక వికెట్ నష్టపోయి 46 పరుగులు చేసింది. మరో వికెట్ చేజార్చుకోకుండా ఇద్దరు బ్యాట్ మెన్స్ ఆచితూచి నెమ్మదిగా ఆడుతున్నారు.  
 

మరిన్ని వార్తల కోసం కింది లింక్స్ క్లిక్ చేయండి

ఆదుకున్న కరాన్: 246 పరుగులకు ఇంగ్లాండు ఆలౌట్

నాలుగో టెస్టు గెలుపుపై కోహ్లీ ధీమా... పకడ్బందీ వ్యూహాలతో బరిలోకి....

Follow Us:
Download App:
  • android
  • ios