Asianet News TeluguAsianet News Telugu

నాలుగో టెస్టు గెలుపుపై కోహ్లీ ధీమా... పకడ్బందీ వ్యూహాలతో బరిలోకి....

ఇంగ్లాండ్ టూర్ లో టీం ఇండియాకు ఎట్టకేలకు గాడిలో పడింది. ఐదు టెస్ట్ ల సీరీస్ లో బాగంగా మొదటి రెండు టెస్ట్ ల్లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న టీం ఇండియా మూడో టెస్టులో మాత్రం అదరగొట్టే ప్రదర్శనను కనబర్చింది. అటు బౌలింగ్ లోనూ, ఇటు బ్యాటింగ్ లోను సమిష్టిగా రాణించి అద్భుత విజయాన్ని అందుకుంది. దీంతో సిరీస్ పై ఆశలను సజీవంగా ఉంచింది.

team india captain kohli press meet about fourth test
Author
Southampton, First Published Aug 30, 2018, 3:55 PM IST

ఇంగ్లాండ్ టూర్ లో టీం ఇండియాకు ఎట్టకేలకు గాడిలో పడింది. ఐదు టెస్ట్ ల సీరీస్ లో బాగంగా మొదటి రెండు టెస్ట్ ల్లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న టీం ఇండియా మూడో టెస్టులో మాత్రం అదరగొట్టే ప్రదర్శనను కనబర్చింది. అటు బౌలింగ్ లోనూ, ఇటు బ్యాటింగ్ లోను సమిష్టిగా రాణించి అద్భుత విజయాన్ని అందుకుంది. దీంతో సిరీస్ పై ఆశలను సజీవంగా ఉంచింది.

ఇక అలాంటి పరిస్థితుల్లోనే నాలుగో టెస్ట్ కు కూడా సిద్దమైంది భారత జట్టు. ఈ మ్యాచ్ ను కూడా తప్పక గెలవాల్సిన పరిస్థితి. లేదంటే టెస్ట్ సీరీస్ ఆశలు గల్లంతే. దీంతో పక్కా వ్యూహాలతో రంగంలోకి తిగుతున్నట్లు టీం ఇండియా సారథి విరాట్ కోహ్లీ తెలిపారు. మూడో టెస్ట్ మాదిరిగానే ఎట్టి పరిస్థితుల్లోను ఈ మ్యాచ్ ను గెలిచి సీరీపై ఆశలను సజీవంగా ఉంచుతామని కోహ్లీ ఆశాభావం వ్యక్తం చేశారు.

గురువారం నుండి సైతాంప్టన్ లో నాలుగో టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా కోహ్లీ మీడియాతో మాట్లాడారు. గత మ్యాచ్ లో ఓటమి కారణంగా ఆతిథ్య ఇంగ్లాడ్ జట్టుపై ఒత్తిడి ఉంటుందని, వీరిపై మరింత ఒత్తిడి పెంచి విజయాన్ని సాధించడానికి ప్రత్యేక వ్యూహాలతో బరిలోకి దిగనున్నట్లు కోహ్లీ తెలిపాడు. కానీ ఇందుకోసం నాటింగ్ హామ్ టెస్ట్ లో కంటే ఇంకాస్త ఎక్కువ కష్టపడాల్సి ఉంటుందన్నారు.

 ప్రస్తుతం సౌంతాప్టన్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలించేలా కనిపిస్తోందన్నారు. అందుకోసమే ఈ టెస్ట్ చిన్న చిన్న మార్పులు ఉండొచ్చన్నారు. షమీ స్థానంలో జడేజా టీంలోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపారు.మ్యాచ్‌కు ముందు మైదానాన్ని మరోసారి పరిశీలించి  నిర్ణయం తీసుకుంటామని కోహ్లి పేర్కొన్నారు. 
 
Follow Us:
Download App:
  • android
  • ios